Gif image of heart  

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ ఆసియాలోని అగ్రగామి విమానయాన హబ్‌లలో ఒకటి కావడానికి సర్వం సిద్ధం అయింది

పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్యతో మా విమానాశ్రయం ఈ రాబోవు సంవత్సరంలో సుమారు 24.5 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధం అవుతోంది. దానితో పాటే, నానాటికీ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ అవసరాలను తీర్చడానికి విమానాశ్రయంలో, చుట్టుపట్ల అసంఖ్యాకమైన వ్యాపార అవకాశాలూ వస్తాయి.

రూట్ అభివృద్ధి

కొత్త దేశీయ, అంతర్జాతీయ మార్గాలను ఆపరేట్ చేయడానికి ఎయిర్‌లైన్స్ ని ప్రోత్సహించడం ద్వారా మా ఎయిర్‌లైన్ భాగస్వామ్య కార్యక్రమం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ (RGIA) ప్రయాణికుల సంఖ్యను పెంచాలని లక్ష్యంగా చేసుకొంది.

ముఖ్యమైన అంశాలు:

  • భారతదేశంలో 5 వ అతిపెద్ద విమానాశ్రయము
  • భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న రెండవ పెద్ద విమానాశ్రయము
  • అత్యధిక సంఖ్యలో దేశీయ గమ్యస్థానాలతో (65) కనెక్ట్ అయి, దక్షిణ, మధ్య భారతదేశములో అత్యంత ఎక్కువగా అనుసంధానించబడిన విమానాశ్రయం
  • హైదరాబాద్‌కున్న మెరుగైన కనెక్టివిటీ వల్ల ట్రాన్స్‌ఫర్‌లలో ఆర్థిక సంవత్సరం‘19లో గత సంవత్సరం కంటే 66 శాతం పెరుగుదల ఉంది

గ్రౌండ్ హ్యాండ్లింగ్

సకాలములో మరియు సమర్థవంతమైన గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందించడానికి, అన్ని విమానాలకూ వేగవంతమైన ఎయిర్‌క్రాఫ్ట్ టర్న్ అరౌండ్ టైమ్ కోసం GHIAL, AI-SATs, సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు గ్లోబ్ గ్రౌండ్ ఇండియా వారికి గ్రౌండ్ హ్యాండ్లింగ్ కన్సెషన్ ఇచ్చింది.

  • గ్రౌండ్ హ్యాండ్లింగ్ కొరకు ఉపయోగించబడే పరికర సామాగ్రి ప్రపంచ శ్రేణితో, పూర్తిగా IATA స్పెసిఫికేషన్లు మరియు Euro III ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.
  • విమానాశ్రయము అన్ని రకాల విమానాలను హ్యాండిల్ చేయగల సమర్థత కలిగి ఉంది.
  • కఠినమైన సర్వీస్ లెవల్ ఒప్పందాలతో ఉన్నత సేవా ప్రమాణాలను నిర్వహిస్తున్నారు.
  • గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సమర్థులు, తగిన యోగ్యత కలిగిన వారు.

‘భారత జాతీయ క్యారియర్లు’ అయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ (IA) మరియు ఎయిర్ ఇండియా (AI) లకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలలో సుదీర్ఘకాలం అనుభవం ఉంది

SATs అనేది సింగపూర్ ఎయిర్‌లైన్స్ యొక్క ఒక సహానుబంధ సంస్థ. SATs అనేది చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్, సింగపూర్ వంటి వివిధ ఆసియా దేశాలలో ఉనికిని కలిగి, ఆసియా అగ్రగామి విమానాశ్రయ గ్రౌండ్ సర్వీసెస్ ప్రొవైడర్‌లలో ఒకటిగా ఉంది.

మరిన్ని వివరాలకు మాకు ఈమెయిల్ చేయండి: marketing.hyd@aisats.in

సుమారు 60 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగియున్న సెలెబి ఏవియేషన్, నేడు 5 దేశాలు, 40 కి మించి కేంద్రాలలో ఉనికితో విమానాశ్రయ సేవలను అందించే ఒక గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంది. సంవత్సరానికి దాదాపుగా 250 వేలకు పైగా విమానాలకు, దగ్గర దగ్గరగా ఒక మిలియన్ టన్నుల కార్గోకు సేవలు అందిస్తూ, సెలెబి టర్కీ మరియు ఇండియాలో మార్కెట్‌లో ఆధిపత్యం కలిగి ఉంది. అదే సమయంలో మధ్య ప్రాచ్యం, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోనూ విస్తరిస్తోంది.

ఏ రకమైన గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంబంధిత ప్రశ్నలకైనా సరే దయచేసి GHIAL యొక్క RGIA – HYD Salesindia.GH@celebiaviation.inను సంప్రదించండి

బర్డ్ గ్రూప్ 100% సంపూర్ణంగా స్వంతం చేసుకున్న వెంచర్ అయిన గ్లోబ్ గ్రౌండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశ అగ్రగామి ప్రైవేట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. ఇది భారతదేశంలోని వివిధ విమానాశ్రయాలలో ఉంది మరియు అన్ని రకాల విమానాలకు సంపూర్ణ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల ప్యాకేజీని అందిస్తోంది.www.globegroundindia.org

మార్కెటింగ్ : marketing@ggimail.in

హెచ్ఆర్‌డి : hrd@ggimail.in

ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్

ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్ సౌకర్యాలను అందించడానికి, ఆపరేట్ చేయడానికి, నిర్వహణ, యాజమాన్యం, అభివృద్ధి చేయడానికి గాను జీహెచ్‌ఐఎఎల్, LSG స్కై చెఫ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మరియు స్కై గౌర్మె క్యాటరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్ రాయితీలను ఇచ్చింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద అవసరమైన సౌకర్యాలను ఆపరేట్ చేయడానికి, నిర్వహించడానికి ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్ కన్సెషనరీలు ఒక్కొక్క దానికి 2.5 ఎకరాలను కేటాయించారు.

ఎల్‌ఎస్‌జి స్కై చెఫ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనేది LSG స్కై చెఫ్స్ గ్రూప్ యొక్క ఒక సభ్య సంస్థ, లుఫ్థాన్సా జర్మన్ ఎయిర్‌లైన్స్ యొక్క 100% సహానుబంధ కంపెనీగా ఉంది. సుమారు 34% మార్కెట్ వాటా, సుమారు 3 బిలియన్ యూరో విక్రయాల పరిమాణముతో, ప్రపంచ వ్యాప్తంగా 220 కు పైగా ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్ కిచెన్లలో 37000 మంది ఉద్యోగులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఎయిర్‌లైన్ క్యాటరింగ్ సంస్థ. ఈ మొత్తం గ్రూపు ప్రస్తుతం సంవత్సరానికి 330 మిలియన్ భోజనాలతో 260 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కి భోజనాలు సరఫరా చేస్తోంది.

ఆర్‌జిఐఏ వద్ద గల ఎల్‌ఎస్‌జి స్కై చెఫ్స్ ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్ యూనిట్, 24 x 7 పని చేస్తూ రోజుకు గరిష్టంగా 11,000 భోజనాల సామర్థ్యమును కలిగి ఉంది.

ఆర్‌జిఐఏ వద్ద ఉన్న ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్ సౌకర్యము హెచ్‌ఏసీసీపీను అమలు చేస్తూ, పర్యావరణ హితమైన వంటశాలతో అత్యున్నత అంతర్జాతీయ క్యాటరింగ్ ప్రమాణాలను పాటిస్తుంది.

స్కై గౌర్మె అనేది 2002 వ సంవత్సరములో స్థాపించబడింది, ఇది `స్కై గౌర్మె’ అనే ట్రేడ్ నేమ్ పేరిట పనిచేస్తోంది మరియు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాదులో తన కార్యకలాపాలను నిర్వహిస్తూ భారతదేశంలోని అగ్రగామి ఎయిర్‌లైన్ క్యాటరింగ్ కంపెనీలలో ఒకటిగా ఉంది. ఇది, రోజుకు సగటున 31,000 భోజనాలను తయారు చేసేందుకు 2000కు పైగా వ్యక్తులను నియమించుకొని, జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, మలేషియన్ ఎయిర్‌లైన్స్, జెట్‌లైట్ వంటి ఎయిర్‌లైన్స్‌కి సేవలను అందిస్తోంది.

ఆర్‌జిఐఏ వద్ద గల స్కై గౌర్మె వారి ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్ యూనిట్, 24 x 7 పని చేస్తూ రోజుకు గరిష్టంగా 25,000 భోజనాల సామర్థ్యమును కలిగి ఉంది.

ఆర్‌జిఐఏ వద్ద అందించే ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్ సౌకర్యము ఎయిర్‌లైన్స్‌కి నాణ్యమైన సేవలను అందించడానికై ఆటోమేటెడ్ పరికరసామాగ్రితో HACCP ప్రమాణాలకు అనుగుణమైన యూనిట్‌ను కలిగి ఉంది.