RGIA వద్ద డ్యూటీ/ట్యాక్స్ ఫ్రీ షాపింగ్ అనుభవాన్ని పొందండి

మీరు అత్యధిక స్థాయి రిటైల్ లాభాలను పొందండి. అత్యంత చక్కని బ్రాండుల నుండి కొన్నింటిని పన్ను లేకుండా కొనుగోలు చేయండి.

హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ (HDF), ప్రపంచంలోని కొన్ని మద్యం, అత్తరులు, కాస్మెటిక్స్, మిఠాయిలు, పొగాకు, ప్రయాణ అవసరాలు, ప్రత్యేకంగా ఎంపిక చేసిన అధీకృత సావెనీర్ల అతి చక్కని బ్రాండులను అందిస్తూ ఒక ఆనందదాయకమైన, సాటిలేని షాపింగ్ అనుభవాన్ని వాగ్దానం చేస్తుంది. మీరు చివరి నిముషంలో కానుకలు కొనాలనుకున్నా, లేదా ఒక ఔత్సాహిక పర్యాటకుడిగా ఉన్నా, మా షాపులలో హాయిగా షాపింగ్ చేయవచ్చు.

అత్యుత్తమ శ్రేణి మద్యం, పర్ఫ్యూములు, మిఠాయిలు, పొగాకు, క్యూరేటెడ్ సావనీర్‌ల కోసం 700 చదరపు మీటర్ల రిటెయిల్ స్థలం ఉంది. ఈ రిటెయిల్ కారిడార్లలో మీరు మీకు కావాల్సినవి ఎంపిక చేసుకోవచ్చు. ఇవి సాటిలేని సానుకూల వాతావరణంతో కస్టమర్-ఫ్రెండ్లీ సిబ్బందిని కలిగి ఉంటాయి. హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ అనేది RGIA నుండి రాకపోకలు సాగించే సుమారు 4 మిలియన్ అంతర్జాతీయ ప్రయాణికుల కొరకు డ్యూటీ, ట్యాక్స్ ఫ్రీ షాపింగ్ గమ్యస్థానము. కస్టమర్లకు ప్రతి సందర్శనతోనూ సాటిలేని విలువ ప్రతిపాదనను, షాపింగ్ అనుభవం అందించడం ద్వారా ఇండియాలో అత్యుత్తమ ట్రావెల్ రిటెయిలర్లలో ఒకటి కావాలని HDF భావిస్తుంది.