GHIAL వద్ద మేము, మా అతిగొప్ప ఆస్తి అయిన - మా ఉద్యోగులపై పెట్టుబడి పెట్టడం మీద విశ్వాసం ఉంచుతాము.

మా వద్ద ఉన్న భవిష్యత్ నాయకులను వృద్ధి చేయడానికి మేము మా అంతర్గత ప్రతిభను పెంచి పోషిస్తాము.

మూల సామర్థ్యాలను గ్రహించి, పెంపొందించడానికి మేము అన్ని స్థాయిలలోనూ విభిన్న మార్గాల (లక్ష్యాల కూర్పు, వైయక్తిక అభివృద్ధి ప్రణాళిక, సామర్థ్య అంచనా, తప్పనిసరియైన నిబంధనా ఆవశ్యకతలు, మొ.) ద్వారా ఉద్యోగుల అభ్యసన అవసరాలను (శిక్షణావసరాల గుర్తింపు) విశ్లేషిస్తాము. తర్వాత ట్యాలెంట్ మేనెజ్మెంట్ గ్రూపు బోధకుడి ఆధారిత శిక్షణ, తర్ఫీదు, యాజమాన్య అభివృద్ధి కార్యక్రమాలు, బహుళ-అంచెల నాయకత్వ అభివృద్ధి విధానం, సెమినార్లు మొదలగు వాటి ద్వారా ఉద్యోగుల అభివృద్ధి కొరకు TNI ను పూర్తి చేయడానికి ప్రణాళికను రూపొందించి ట్రాక్ చేస్తుంది.

నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం

సంస్థ దీర్ఘకాలిక విజయాల కోసం ఉద్యోగులకు మెరుగైన నాయకత్వ అభివృద్ధి అవకాశాలను కల్పించాల్సిన ప్రాముఖ్యతను GMR గుర్తిస్తుంది. GMR గ్రూప్ కొరకు భవిష్యత్ నాయకులను నిర్మించడానికై అన్ని స్థాయిలలోనూ సిగ్నేచర్ లీడర్‌షిప్ పైప్‌లైన్ ప్రోగ్రాములు రూపొందించబడ్డాయి.

విస్తృత స్థాయి అభివృధ్ధి సంబంధిత అవకాశాలను అందిస్తూ విభిన్న సమర్థతా ఆవశ్యకతలకు తగ్గట్టు శిక్షణా మాడ్యూల్స్‌ను రూపొందించడం జరిగింది.

ది జీఎంఆర్ ఏవియేషన్ అకాడెమీ

GHIALలో ఒక ఇన్-హౌస్ అకాడెమీ కూడా ఉంది, అది నాయకత్వ అభివృద్ధి పట్ల సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఉద్యోగులకు GMRAA సాంకేతిక శిక్షణలను అందిస్తుంది ఇంకా RISHTA హక్కుదారులకు సర్వీస్ ఎక్సలెన్స్ శిక్షణను అందజేస్తుంది, అవి కస్టమర్ సర్వీస్ పై శిక్షణలు ఇచ్చి, కస్టమర్‌పై దృష్టి సారింపుకు అవకాశాన్ని కల్పిస్తాయి.

జీఎంఆర్ గ్లోబల్ ఏవియేషన్ నిపుణులు

ఆశావహులైన నైపుణ్యం గల ఉద్యోగులు గ్లోబల్ సర్టిఫికేషన్లను పొందడంలో సహాయపడేందుకై, వారిని ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలకు నామినేట్ చేస్తారు, వాటిని IATA, ACI వంటి సంస్థలు అందిస్తాయి.

రేపటి ప్రతిభను సృష్టించడానికై ఈ రోజున వారిని పెంపొందించడం అనేదానిపై మేం ప్రధానంగా దృష్టి సారిస్తాము. ఈ లక్ష్యసాధనలో అభ్యసన ప్రక్రియపై దృష్టి సారిస్తారు.