సంవత్సరానికి 1,50,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని నిర్వహించుకునే కార్గో టెర్మినల్, దీని అంతిమ సామర్థ్యం సంవత్సరానికి 5,00,000 మెట్రిక్ టన్నుల వరకూ పలు భాగాలుగా విస్తరించుకోవచ్చు.
ఒకే చోట కార్గో హ్యాండ్లింగ్, కార్గో ప్రాసెసింగ్, నిల్వ, కస్టమ్స్, బ్యాంకింగ్ మొదలైన సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ కార్గో విలేజ్
24X7 కస్టమ్స్ ఆపరేషన్లతో 14,330 చదరపు మీటర్లకు పైగా స్థలములో విస్తరించిన మోడ్యులర్ ఇంటిగ్రేటెడ్ టెర్మిన ల్భవనము
ఫార్మా జోన్ – దేశీయ, అంతర్జాతీయ కార్గో (ఇంపోర్ట్ మరియు ఎక్స్‌పోర్ట్) కొరకు అంకితమైన కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు.
కూల్ కంటైనర్ల కోసం నాన్-స్టెరైల్ పరీక్ష , స్టెరైల్ ఏరియా రెండింటిలోనూ డేటా లాగర్లు ఇంకా ప్లగ్ పాయింట్లతో నిర్మిత ULDల కొరకు 02 నుండి 08 డిగ్రీలు మరియు 15 నుండి 25 డిగ్రీలతో డెడికేటెడ్ జోన్‌లు.
అపాయకరమైన వస్తువులు, సున్నితమైన కార్గో, ఎయిర్‌లైన్ మెటీరియల్ నిల్వ చేయడానికి ప్రత్యేక సదుపాయాలు.
అనధికారికంగా ఫెసిలిటీలో ప్రవేశించడాన్ని నివారించేందుకు స్ట్రాంగ్ రూము ఇంకా యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థలు
తగిన డాకింగ్ సౌకర్యము, CCTV కెమరాల ద్వారా 24X7 నిఘా, బహుళ అంచెల ర్యాకింగ్ వ్యవస్థ ఇంకా డాక్ లెవెలర్స్‌తో సహా అత్యాధునిక పరికరాలు, లిఫ్ట్ & రన్ వ్యవస్థ, బ్యాటరీతో నడిచే ఫోర్క్‌లిఫ్ట్‌లు, హై రీచ్ ట్రక్కులు మొదలైనవి.
బాండెడ్ ట్రక్కింగ్, ఎక్స్-రే సేవలు, అనిమల్ క్వారంటైన్ & సర్టిఫికేషన్, సస్య రక్షణ & స్టోరేజ్ డైరెక్టొరేట్, కేంద్రీయ ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ, మొదలగువాటితో సహా మెరుగైన సదుపాయాలు
ఈ టర్మినల్ భారతదేశంలో WHO-GDP (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాక్టీసెస్) ద్వారా సర్టిఫై చేయబడిన ఒక ముఖ్య గేట్వే లొకేషన్. ఉష్ణోగ్రత నీయంత్రనాధారిత కార్గో యొక్క అంతరాయం లేని నిర్వహణ మరియు పంపిణీ కొరకు ఈ టర్మినల్ ప్రత్యేకంగా నిర్మించబడింది.
ఈ సౌలభ్యం EU సెక్యూరిటీ స్టాండర్డ్స్, IATA ఇ-ఫ్రైట్ కంప్లైంట్, ISO 9001:2015 యొక్క సర్టిఫైడ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ISAGO యొక్క భద్రతా ప్రమాణాలు (IATA సేఫ్టీ ఆడిట్ ఫర్ గ్రౌండ్ ఆపరేషన్స్), TAPA (ట్రాన్స్ పోర్టెడ్ అసెట్ ప్రొటెక్షన్ అసోసియేషన్) కింద RA3 ధృవీకరణకు అనుగుణంగా నిర్మించబడింది.
ఎగుమతిలోని అన్ని టచ్ పాయింట్లు ఉష్ణోగ్రత-నియంత్రిత ప్రాంతాలుగా మార్చబడ్డాయి. ఎక్స్-రే ఏరియా, రాకింగ్ ఏరియా, ULD/ప్యాలెట్ బిల్ట్-అప్ ఏరియా మరియు ULD/ప్యాలెట్ స్టోరేజ్ ఏరియా ఇప్పుడు విభిన్న టెంపరేచర్ జోన్ లను కలిగి ఉంటాయి మరియు అన్నీ టెంపరేచర్ కంట్రోల్ ని కలిగి ఉంటాయి. టెర్మినల్ ఎగ్జిట్ నుంచి ఎయిర్ సైడ్ లోని ఎయిర్ క్రాఫ్ట్ కు ULD లు /ప్యాలెట్లను సురక్షితంగా రవాణా చేయడానికి కూల్ డాలీ సదుపాయం ఉంది, తద్వారా ఉష్ణోగ్రత అసంబద్ధతలు నివారించబడతాయి.
ఛార్జింగ్ సదుపాయం కలిగిన కూల్ టైనర్ (170 యూనిట్లు) నిల్వ, నిర్వహణకు ప్రత్యేక యార్డు. అవసరమైన విధంగా కదలికను సులభతరం చేయడానికి ఇది ఉద్దేశించబడింది.