GHIAL గురించి
GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (“GHIAL”), భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (13%), తెలంగాణ ప్రభుత్వము (13%) మరియు మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హాద్ (MAHB) (11%) ల భాగస్వామ్యముతో GMR గ్రూపు (74%) ప్రమోట్ చేసిన ఒక ఉమ్మడి భాగస్వామ్య సంస్థగా ఉంది.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యము (PPP) నమూనాలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA), హైదరాబాద్‌ను డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్ విధానంలో ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించడానికి GHIAL కి అప్పగించారు.
వాణిజ్యపరమైన, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరముగా, పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానముగా అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ, భారత ప్రభుత్వ దార్శనికతలను సమన్వయపరచుకుంటూ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రంగా, చుట్టూ ఎయిర్‌పోర్ట్ సిటీ ఉండే పర్యావరణ వ్యవస్థను రూపొందించేలా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
దక్షిణ, మధ్య భారతదేశానికి ఒక కొత్త ముఖద్వారముగా ఆవిర్భవించి, హైదరాబాద్ విమానాశ్రయం కేవలం 31 నెలల రికార్డు సమయములో ఏర్పాటై, ఏడాదికి 12 మిలియన్ల తొలి సామర్థ్యము (MPPA)తో మరియు ఏడాదికి 150,000 టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సమర్థతతో 2008 మార్చ్ 14 వ తేదీన ప్రారంభించబడింది. ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం విమానాశ్రయాన్ని దశల వారీగా 100 MPPA కు మించి అంతిమ సామర్థ్యానికి పెంచుకోవచ్చు.
ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయం సంవత్సరానికి 25 మిలియన్లకు పైగా ప్రయాణికులను మరియు సుమారు 1,59,000 టన్నుల సరుకును నిర్వహిస్తుంది. హైదరాబాద్ విమానాశ్రయం 20 అంతర్జాతీయ మరియు 3 భారతీయ ప్రయాణికుల క్యారియర్ల ద్వారా 18 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తుంది. సుమారు 65 దేశీయ గమ్యస్థానాలకు 9 దేశీయ క్యారియర్లు సేవలందిస్తున్నాయి. వీటితో పాటు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 3 కార్గో ఎయిర్లైన్స్ ప్రత్యేక సరుకు రవాణా సేవలను నడుపుతున్నాయి.
నేడు, హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోని ఉత్తమ విమానాశ్రయాలలో ఒకటిగా రేటింగ్ పొంది ఉంది. కార్యకలాపాలు, నాణ్యత గల సేవలు మరియు ప్రయాణికుల అనుభవంలో బెంచ్మార్క్లను నిర్దేశించింది. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఎసిఐ) - ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఎఎస్క్యూ) ప్యాసింజర్ సర్వే ద్వారా సంవత్సరానికి 15 - 25 మిలియన్ల ప్రయాణికుల విభాగంలో ఆసియా పసిఫిక్ లో ఉత్తమ విమానాశ్రయ స్థానాన్ని పొందింది.
హైదరాబాద్ విమానాశ్రయము కార్యనిర్వహణలో సమర్థత, పర్యావరణ సుస్థిరత, భద్రత, కార్పొరేట్ గవర్నెన్స్ ఇంకా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటి పలు అంశాలలో మెరుగైన ప్రదర్శనకుగాను దాదాపు 100+ అవార్డులను గెలుపొంది అత్యంత అధిక అవార్డులు గెలుపొందిన విమానాశ్రయాలలో ఒకటిగా నిలిచింది. ఈ అవార్డులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రయాణికులకు శ్రేష్టమైన సేవలను అందించడానికి GHIAL నిరంతరమూ చేసే ప్రయత్నాలను ప్రతిబింబిస్తాయి.
సాంకేతికత, నవీనతలలో అగ్రగామి అయిన హైదరాబాద్ విమానాశ్రయము, ప్రయాణికులకు నిరాటంకమైన, మెరుగైన అనుభవాన్ని అందించడానికై సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ముందు వరుసలో ఉంది. ఇది భారతదేశంలో విశిష్టమైన ఈ-బోర్డింగ్ సొల్యూషన్‌ను పరిచయం చేసిన మొట్టమొదటి విమానాశ్రయముగా, ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్యాసెంజర్ ప్రాసెసింగ్ వ్యవస్థ కలిగిన ఏకైక విమానాశ్రయము. తద్వారా భవిష్యత్తులో నిరాటంకమైన, పేపర్‌లెస్ ప్రయాణానికి దారులు వేస్తోంది.
భారత విమానయాన పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి అనుకూల విధానాలు, వృద్ధి వేగాన్ని పెంపొందించడానికి జిహెచ్ఐఎఎల్ యొక్క నిరంతర ప్రయత్నాలతో, హైదరాబాద్ విమానాశ్రయం భారతదేశంలో 4వ రద్దీగా ఉండే విమానాశ్రయంగా అవతరించింది. డిమాండ్ లో ఈ పెరుగుదలను తీర్చడానికి, హైదరాబాద్ విమానాశ్రయం తన సామర్థ్యాన్ని 34 ఎంపిపిఎకు పెంచడానికి పెద్ద ఎత్తున విస్తరణకు శ్రీకారం చుట్టింది.
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఎదుగుదలకు కేంద్రంగా ఉండాలనే లక్ష్యంతో, GHIAL ప్రస్తుతం వాణిజ్యపరమైన కార్యాలయ స్థలం, రిటైల్, విరామం మరియు వినోదం, ఆతిథ్యము, చదువు, ఆరోగ్య సంరక్షణ, ఏరోస్పేస్, లాజిస్టిక్స్ వంటివాటితో కలిపి ‘థీమ్/పోర్ట్’ ఆధారిత అభివృద్ధి జోన్‌లతో ఒక సమీకృత పర్యావరణ వ్యవస్థ అయిన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సిటీని అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ విమానాశ్రయముచే అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఇంకా ప్రపంచస్థాయి కనెక్టివిటీచే మద్దతు ఇవ్వబడిన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సిటీ ప్రపంచస్థాయి ఇన్వెస్టర్లు, అద్దెదారుల తొలి ఎంపికగా ఉద్భవించింది.
జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ ట్విన్ ప్లాటఫోరం ను ప్రారంభించింది. ఈ ప్లాటఫోరం, ఎపిఓసి (ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్) కు ఇన్పుట్ ఇచ్చే విధంగా పని చేస్తుంది. ఇది భాగస్వాముల మధ్య రియల్-టైమ్ సహకారం ని పెంచుతుందని, ఆపరేషనల్ సామర్థ్యాన్ని ఐఎఓఎస్ (ఇంటెలిజెంట్ ఎయిర్ పోర్ట్ ఆపరేటింగ్ సిస్టమ్) ద్వారా మెరుగుపరుస్తుందని చెప్పబడింది. ఈ సాంకేతికత ప్రయాణికుల అనుభవాలను మెరుగుపరచడానికి ఆధునిక టెక్నాలజీ మరియు రియల్-టైమ్ విశ్లేషణలను ఉపయోగిస్తుంది.
మీడియా సందేహాలకై, దయచేసి సంప్రదించండి:
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్
(సి.ఐ.ఎన్: U62100TG2002PLC040118)
జీఎంఆర్ ఏరో టవర్స్
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము
శంషాబాద్, హైదరాబాద్ - 500 108
తెలంగాణ, భారతదేశం