Gif image of heart  

పుష్పక్ - భద్రత మరియు సౌకర్యత కోసం లగ్జరీ ఎయిర్‌పోర్ట్ లైనర్

కళాత్మకమైన, ఎయిర్ కండీషన్ చేయబడిన, కాలుష్య/శబ్ద రహితమైన ఎలెక్ట్రిక్ బస్సులు విమానాశ్రయం నుండి నగరం యొక్క వివిధ ప్రాంతాలకు రాకపోకలకు నడుస్తాయి. లగ్జరీ సీట్లు,సెల్ ఫోన్ ఛార్జింగ్, వయోవృద్ధుల కొరకు మోకాళ్ళు క్రిందికి చేసే మెకానిజంతో వీల్ చెయిర్ ర్యాంప్, డిజిటల్ గమ్యస్థాన బోర్డులు ఉంటాయి.

మీ పుష్పక్ డీల్స్ పొందండి
  • ముగ్గురు లేదా అంతకు మించిన వ్యక్తులకు గ్రూప్ డిస్కౌంట్‌లు
  • 10%off on return journey (valid for 10 days)
  • మీ పుష్పక్ నెలసరి పాస్ తీసుకోండి (సిటీ బస్సులు/ఎసి బస్సులలో చెల్లుతుంది)

ఎయిర్‌పోర్ట్ లైనర్ వేళలు -1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎయిర్‌పోర్ట్ లైనర్ వేళలు -2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్ విమానాశ్రయము వద్ద మీరు దిగినప్పుడు అరైవల్ లాంజ్ వద్దనే మీరు ఒక లగ్జరీ కారును బుక్ చేసుకోవచ్చు. కారు కోసం సమయము మరియు శక్తిని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు లేదా పైకీ క్రిందికీ తిరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఈ గేటు వద్దనే మీ కోసం తప్పనిసరిగా వేచి ఉంటుంది.

బుకింగ్ కొరకు కాల్ చేయండి: +91 9885566158

శ్రీనివాసా రెంట్ ఎ క్యాబ్ అనేది ఇండియాలో 40+ నగరాలలో పనిచేస్తున్న ఒక కార్పొరేట్ కార్ రెంటల్ కంపెనీ. నిపుణులైన చోదకులు / డ్రైవర్లతో కార్లు చక్కగా మరియు శుభ్రంగా ఉంటాయి మరియు లోకల్ డ్రాప్స్, పూర్తి రోజు లేదా బయటి చోట్లకు వెళ్ళే అవసరాల కోసం కస్టమరు ర్యాంప్ / అరైవల్ ఎగ్జిట్ గేటు దగ్గరి నుండే కారు ఎక్కవచ్చు

వెబ్ సైట్: www.srinivasatours.com

బుకింగ్ కొరకు కాల్ చేయండి: +91 7337334703 / 04

ఓలా క్యాబ్స్ (OLΛ గా శైలి ఇవ్వబడినది) అనేది పీర్-టు-పీర్ రైడ్ షేరింగ్, సవారీ సేవను అందించే మరియు టాక్సీని చేరి ఉండే సేవలను అందించే ఒక భారతీయ సవారీ భాగస్వామ్య కంపెనీ (TNC) గా ఉంది. ఈ కంపెనీ ఇండియా, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో నెలకొని ఉంది మరియు ANI టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే అభివృద్ధిపరచబడింది.

ఎయిర్‌పోర్ట్ హెల్ప్‌లైన్ కాల్: +91 9398754653

సాధారణంగా ఉబర్ అని పిలువబడే ఉబర్ టెక్నాలజీస్ అనేది అమెరికాకు చెందిన ఒక బహుళ-జాతీయ సవారీ-సౌకర్యాలను కల్పించే కంపెనీ, ఇది సహచర రైడ్-షేరింగ్ మరియు సవారీ సేవను చేరి ఉండే సేవలను అందజేస్తుంది.

ప్రీపెయిడ్ టాక్సీ, ప్రయాణ దూరం ఆధారంగా ముందస్తుగా నిర్ణయించబడిన ఛార్జీని అడ్వాన్సుగా చెల్లించేలా బుకింగ్ డెస్క్ వద్ద బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తుంది.

బుకింగ్ కొరకు కాల్ చేయండి: +91 40 66606093

షీ క్యాబ్స్ మహిళలకు అనగా., పనిచేస్తున్న స్త్రీలకు సురక్షితంగా మహిళల చేతుల ద్వారా ప్రయాణించడానికి ఎంతో అవసరమైన సేవను అందిస్తాయి. మహిళా పైలట్లు మహిళలపై జరుగుతున్న సమస్యలను నివారించే బాధ్యత తీసుకుంటారు. కార్లు ఒక ఎమర్జెన్సీ బటన్‌తో సమృద్ధమై ఉంటాయి, అది సమీప పోలీస్ స్టేషన్‌ని సంప్రదించడానికై ఒక అలారం వ్యవస్థగా పనిచేస్తుంది.

బుకింగ్ కొరకు కాల్ చేయండి: +91 40 66606093

మేరుతో నగరమంతటా 24X7 సవారీ చేయడం సులభతరం, వేగవంతం మరియు సౌకర్యవంతమయింది. హైదరాబాద్ విమానాశ్రయము వద్ద నేరుగా మేరు జోన్ నుండే మీ రైడ్ ఎక్కండి లేదా మా ప్రపంచశ్రేణి మేరు యాప్ ద్వారా ఒక రైడ్ బుక్ చేసుకోండి

బుకింగ్ కొరకు కాల్ చేయండి: +91 9550359294

స్కైక్యాబ్స్ అనేది హైదరాబాదు, సికింద్రాబాద్ జంటనగరాలంతటా 400కు పైగా క్యాబ్స్ ను నడుపుతున్న ఒక రేడియో ట్యాక్సీ సర్వీసు. నగరములో బలమైన ఉనికితో కలుపుకొని, స్కైక్యాబ్స్ కస్టమర్లకు 24X7 సేవలు అందించడానికి విమానాశ్రయంతో భాగస్వామ్యం వహించింది.

బుకింగ్ కొరకు కాల్ చేయండి: +91 8499078683

రూట్ మ్యాపులు

ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ మ్యాపులు

విమానాశ్రయములో మరియు చుట్టుపట్ల మీరు సులభంగా తిరగడానికి ఈ కరపత్రము మీకు సహాయపడుతుంది.

పార్కింగ్ సమాచారం

పార్కింగ్ ధరల పట్టిక

కార్ పార్క్ ఆపరేటరు నుండి నాణ్యమైన పార్కింగ్ సర్వీస్ భరోసా ఉంటుంది. పార్కింగ్ ప్రదేశం నుండి త్వరిత ప్రవేశం, నిష్క్రమణ కొరకు సమర్థవంతమైన సమీకృత పార్కింగ్ ఆటోమేషన్ వ్యవస్థ.

మా ఎయిర్‌పోర్ట్ వద్ద పార్కింగ్ ఛార్జీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

4 వీలర్ (ప్రైవేటు వాహనాలు)

మొదటి అర్ధ గంటకు రు. 50
అర గంట నుండి ఒక గంట వరకు రు. 150
ఒక గంట నుండి రెండు గంటల వరకు రు. 200
ప్రతి తదుపరి గంట లేదా అందులో భాగానికి రు. 50
ప్రతి 24 గంటలకు రు. 500

4 వీలర్ (వాణిజ్య వాహనాలు)

మొదటి ఒక గంటకు రు. 250
తదుపరి ప్రతి గంటకు రు. 50
ప్రతి 24 గంటలకు రు. 600

2 వీలర్ పార్కింగ్

మొదటి 2 గంటలకు రు. 30
ప్రతి తదుపరి గంట లేదా అందులో భాగానికి రు. 10
24 గంటలకు గరిష్టంగా రు. 100/- వరకు

కోచ్ పార్కింగ్

మొదటి 2 గంటలకు రు. 200
ప్రతి తదుపరి గంట లేదా అందులో భాగానికి రు. 100
24 గంటలకు గరిష్టంగా రు. 1000/-

వాలెట్ పార్కింగ్

వాలెట్ సర్వీస్ ఇప్పుడు నిష్ర్కమణల వద్ద మాత్రమే 24X7 అందుబాటులో ఉంది
వాలెట్ సర్వీస్ రుసుములు ఈ క్రింది విధంగా ఉంటాయి –
మొదటి 2 గంటలు – రు. 300
2 గంటలు – 24 గంటలు – రు. 600
ప్రతి అదనపు రోజుకు – రు. 600 ప్రతి 24 గంటలకు
వాణిజ్య వాహనము 00 నుండి 24 గంటలకు రు. 750

గో కార్టింగ్ కస్టమర్లకు ప్రత్యేక పార్కింగ్ ఛార్జీలు
కార్ పార్కింగ్ ఛార్జీలు - మొదటి 4 గంటలకు రు. 50

పలు దినాల పాటు పార్కింగ్ - 24 గంటల ప్రకారము ఛార్జీలు వర్తిస్తాయి, తదుపరి రోజుకు, గంటల వారీ ఛార్జీలు వర్తిస్తాయి, అయితే మొత్తం రోజులో 24 గంటలకు మించకుండా మాత్రమే.

టెలిఫోన్:
కార్ పార్క్ ఆఫీస్ : +91 40 66604210

పార్కింగ్ టికెట్ పోగొట్టుకుంటే ఛార్జీలు

టూ-వీలర్ - రు. 150 ప్లస్ పార్కింగ్ ఛార్జీలు
4 వీలర్ (ప్రైవేటు వాహనం) - రు. 550 ప్లస్ పార్కింగ్ ఛార్జీలు
4 వీలర్ (వాణిజ్య వాహనం) - రు. 650 ప్లస్ పార్కింగ్ ఛార్జీలు
కోచ్‌లు - రు. 1050 ప్లస్ పార్కింగ్ ఛార్జీలు

ఫాస్టాగ్:
హైదరాబాద్ విమానాశ్రయ పార్కింగ్‌లో ఫాస్టాగ్ సౌకర్యము ఉంది. పార్కింగ్ వాడుకదారులు ప్రత్యేకమైన ఫాస్టాగ్ మార్గాల ద్వారా ప్రవేశించవచ్చు, సౌకర్యంగా ఉండే చోట తమ వాహనాన్ని పార్క్ చేసుకోవచ్చు. ఫాస్టాగ్ ద్వారా చెల్లించదగిన గరిష్ట మొత్తము రు. 1,500

ర్యాంప్‌లపై పార్కింగ్

అరైవల్ ర్యాంప్ పై ఓవర్ స్టే ఛార్జీలు.

ర్యాంప్ పై పార్కింగ్ మొదటి 8 నిమిషాలు ఉచితం. 8 నిమిషాల తరువాత, ఈ క్రింది ఛార్జీలు వర్తించబడతాయి :

8 - 10 నిమిషాలు వరకు : రూ. 100
10 - 15 నిమిషాలు వరకు : రూ. 200
15 నిమిషాల కంటే ఎక్కువ సేపు పార్క్ చేసిన వాహనాలను తొలగించబడతాయి.

VIP పార్కింగ్ - అన్ని కేంద్ర / రాష్ట్ర మంత్రులు, MP, MLA, ఉన్నత ప్రభుత్వ అధికారి, విదేశీ అధికారిక ప్రతినిధి బృందం, సైన్యం/పోలీసు అధికారి మరియు ప్రోటోకాల్ విభాగానికి చెందిన VIP/VVIP మొదలైనవి.

ర్యాంపులు అన్నింటి పైకి టూ వీలర్లు మరియు ఆటోరిక్షాలు అనుమతించబడవు.

హైదరాబాద్ యందు నెలకొని ఉన్న ప్రీమియం కార్ మరియు కోచ్ రెంటల్ సర్వీస్ అయిన 4 వీల్ ట్రావెల్స్, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము వద్ద ప్రపంచ ప్రయాణికులకు లక్స్ రైడ్స్ అనే కాన్సెప్ట్ బ్రాండుతో గ్రౌండ్ మొబిలిటీ సేవలు మరియు అత్యుత్తమ సౌకర్యాలతో స్వయంగా నడుపుకునే మరియు డ్రైవర్ సేవలను అందజేస్తుంది. వాహన శ్రేణిలో బిఎండబ్ల్యు 7 సీరీస్, వోల్వో S 90, బిఎండబ్ల్యు GT, వోల్వో S60, లాంబోర్ఘినీ గాలార్డో, జాగ్వార్ టైప్ S కన్వర్టిబుల్, పోర్ష్ 911 కార్రెరా 4, ఫోర్డ్ ముస్తాంగ్, మాసెరటి ఘిబ్లీ, ఆడి A3 కాబ్రియోలెట్ మరియు ఇంకా మరెన్నో ఉన్నాయి.

బుకింగ్ కొరకు కాల్ చేయండి: +91 9959121121

ఇమెయిల్: hyderabad@luxerides.in

వెబ్ సైట్: www.4wheeltravels.com

రాయితీ విచారణ కోసం మాకు వ్రాయండి: commercialopp.hyd@gmrgroup.in