GMR ఏవియేషన్ అకాడెమీలో చేరండి
వృత్తినైపుణ్యమైన శిక్షణ అందించడానికి, GMR ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పరిజ్ఞానము, నైపుణ్యాలను పెంపొందించడానికి GMR ఏవియేషన్ అకాడెమీ (GMR AA)ని, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్, హైదరాబాద్‌లో 2009లో స్థాపించారు. సంవత్సరాలు గడిచే కొద్దీ, ఢిల్లీలో పూర్తి వసతులు గల యూనిట్‌తో, ఇది భారతదేశంలో GMR స్వంత సిబ్బందికి మాత్రమే కాకుండా భారతదేశం, విదేశాలలోని దాని సహచర సంస్థలు, అనుబంధ సంస్థలకు కూడా ఏవియేషన్ అభ్యసనానికి ప్రపంచ ముఖద్వారంగా ఉద్భవించింది. ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్యం మరియు ఆఫ్రికా ప్రాంతాలపై దృష్టిసారింపుతో ఈ అకాడెమీ ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI), ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA), ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO), పౌర విమానయానసంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ (DGCA), మరియు భారతదేశ పౌర విమానయాన భద్రత యొక్క బ్యూరో(BCAS)చే గుర్తింపు పొందిన శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. GMR AA క్రేన్‌ఫీల్డ్ యూనివర్సిటీ (UK) లాంటి వాటి సమన్వయముతో "విమానాశ్రయ నిర్వహణలోని ఆర్థికాంశాలు" వంటి అంశాలలో శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.
GMR AA అనేది ICAO, ACI, IATA, భారతదేశ DGCA, BCAS చే గుర్తింపు పొందింది. ఈ అకాడెమీ, భారతదేశంలో ICAO యొక్క "రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" (RTCE) హోదాతో, ACI చే "ప్రపంచ శిక్షణా హబ్" గా గుర్తింపు పొందిన ఏకైక సంస్థ. ఇది IATA యొక్క అధీకృత శిక్షణా కేంద్రముగా, గుర్తింపు పొందిన ట్రైనింగ్ స్కూల్‌గా కూడా ఉంది.
GMR AA, విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, కార్గో, రక్షణ మరియు భద్రత, కార్పొరేట్ ఏవియేషన్ మున్నగు అంశాలలో వైవిధ్యమైన ఏవియేషన్ అనుభవం ఉన్న నిపుణులైన బోధకులతో నాణ్యమైన విద్యను అందిస్తుంది. నిపుణులైన బోధకులు, విషయ పరిజ్ఞాన నిపుణుల ద్వారా నిర్వహించబడే నాణ్యమైన కార్యక్రమాలు ప్రపంచంలో అత్యుత్తమంగా పరిగణించబడేవి, ఢిల్లీ లేదా హైదరాబాద్ విమానాశ్రయాల ఉద్యోగవిధుల్లో ఉన్నప్పుడు ఆచరించే శిక్షణ (OJT) రూపేణా విశిష్టమైనవి. మేము ప్లేస్‌మెంట్‌లో సహాయపడతాము, మా పూర్వ విద్యార్థుల్లో అనేకమంది ఇప్పుడు ప్రధాన విమానాశ్రయాలు (భారతదేశం, విదేశాలలో), ఎయిర్‌లైన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెంట్లు, కార్గో ఆపరేషన్లు, ఏవియేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఆతిథ్య ప్రధాన కంపెనీలు మొదలగు వాటిలో నియమితులయ్యారు. మా కోర్సులలో ప్రధానంగా వాస్తవ- జీవన పరిస్థితులు మరియు ఉదాహరణలపై, ఏవియేషన్ రంగములో ఎప్పటికప్పుడు ఆధునీకరించబడే ఏవియేషన్ శిక్షణ మరియు విజయవంతమగు భవిష్యత్తు కొరకు ప్రేరణతో విమానాశ్రయ/ఎయిర్‌లైన్ ఆపరేషన్ల ప్రధాన అంశాలపై దృష్టి సారించడం జరుగుతుంది,.
అందించే కోర్సులు
- ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్లలో సర్టిఫికేషన్
- ఎయిర్‌పోర్ట్ & కార్గో ఆపరేషన్లలో సర్టిఫికేషన్
- రిటైల్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికేషన్ - ఏవియేషన్ & జనరల్
- ఎయిర్‌పోర్ట్ బిజినెస్ పరిచయం – ITAB
- GMR భవిష్యత్ విమానయాన నిపుణులు – GFAP
- అపాయకరమైన వస్తువుల నియంత్రణ ప్రోగ్రాం
- ప్రాథమిక ఫైర్ ఫైటర్స్ ప్రోగ్రాం – ఏవియేషన్
- ప్రాథమిక ఫైర్ ఫైటర్స్ ప్రోగ్రాం – పారిశ్రామికం
- జూనియర్ ఫైర్ ఆఫీసర్ల ప్రోగ్రాం
- సీనియర్ ఫైర్ ఆఫీసర్ల ప్రోగ్రాం
- గ్లోబల్ క్యాబిన్ సిబ్బంది ప్రోగ్రాం
- క్యాబిన్ సిబ్బంది ప్రోగ్రాం - EASA లైసెన్స్
- ACI కార్యక్రమాలు - ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా యాజమాన్య వ్యవస్థలను అభివృద్ధిపరచడంపై కోర్సు.
- ICAO కార్యక్రమాలు – ఎనర్జీ, పర్యావరణ సంబంధిత డిజైన్, ఎయిర్‌పోర్ట్ మౌలిక సదుపాయాల ఆపరేషన్ యందు నాయకత్వము
జీఎంఆర్ ఏవియేషన్ అకాడెమీ – హైదరాబాద్, భారతదేశం
గ్రౌండ్ ఫ్లోర్
SSC, GMR ఏరో టవర్స్,
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము,
శంషాబాద్,
హైదరాబాద్, భారతదేశం - 500108
జీఎంఆర్ ఏవియేషన్ అకాడెమీ – ఢిల్లీ
టెర్మినల్ 2,
డిపార్చర్స్ ఎదుట,
గేట్ నం.1,
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము,
న్యూ ఢిల్లీ, భారతదేశం – 110037