పర్యావరణ మరియు సుస్థిరత్వ పాలసీ జనవరి 2021

కార్బన్ న్యూట్రల్ మరియు సుస్థిరమైన విమానాశ్రయము

  • GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము ఒక కార్బన్ న్యూట్రల్ విమానాశ్రయం. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతములో ACI చే కార్బన్ న్యూట్రాలిటీ విషయంలో అత్యధికంగా లెవల్ 3+ గుర్తింపును సాధించిన మొట్టమొదటి విమానాశ్రయము.

  • GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము, భారతదేశంలో ఆన్‌లైన్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ స్టేషన్ కలిగిన మొట్టమొదటి విమానాశ్రయము.

  • ఆహార వ్యర్థాలను ల్యాండ్‌స్కేప్ వాడకం కోసం కంపోస్టు ఎరువుగా మార్చేందుకు ఇన్-హౌస్ కంపోస్టింగ్ ప్లాంటు కలిగిన మొట్టమొదటి భారతీయ విమానాశ్రయం.

  • తన విమానాశ్రయ కార్యకలాపాల కోసం సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం ద్వారా థర్మల్ విద్యుత్తు వాడకాన్ని తగ్గిస్తోంది.

  • నీరు అమూల్యమైన వనరు అని GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విశ్వసిస్తుంది. ఇక్కడ పెద్దయెత్తున వర్షపు నీటి సంరక్షణ జరుగుతుంది. ఇది విమానాశ్రయ ఆవరణంలో భూగర్భజలమట్టము వృద్ధికి తోడ్పడుతోంది.

గ్రీన్ కవర్

ఎయిర్‌పోర్ట్ చుట్టూ పర్యావరణ సమతుల్యత కోసం వివిధ రకాల మొక్కల జాతులు, సహజంగా పెరిగే మొక్కలతో 273 హెక్టార్ల పచ్చదనం ఉంది. ప్రతి సంవత్సరమూ 265 టన్నుల కార్బన్ డయాక్సైడ్ పీల్చుకోవడం ద్వారా చెట్లు కర్బన గ్రాహ్యకాలుగా పనిచేస్తాయి.

మా నర్సరీ ఉద్యానం వద్ద షాపింగ్ చేయండి

మీ ఇంటికి లేదా మీ అతిథులకు మా హరిత ప్రయత్నంలో ఒక భాగాన్ని తీసుకువెళ్ళండి. ఈ మొక్కలు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నర్సరీలో పెంచబడ్డాయి.

ప్రదేశం: ఆగమనాలు

విద్యుత్తును పొదుపు చేసే నిర్మాణ సంబంధిత డిజైన్‌లు

జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్యాసెంజర్ టెర్మినల్ తన పర్యావరణ-హితమైన నిర్మాణసంబంధిత డిజైన్ కోసం ‘లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్ మెంటల్ డిజైన్’ (LEED) సర్టిఫికేషన్‌ను పొందింది. విద్యుత్, నీటి వాడకం కనిష్టంగా ఉండేలా ప్రకృతిసిద్ధమైన వెలుతురు, ఇతర పర్యావరణ అంశాలను గరిష్టంగా ఉపయోగించుకునేలా ఈ టెర్మినల్ నిర్మించారు.

మీ ప్లాస్టిక్ ఫుట్ ప్రింట్ తగ్గించుకోండి

విమానాశ్రయములో పనిచేసే కన్సెషనర్లు, ఔట్‌లెట్లు అన్నింటి సహకార సమన్వయముతో ప్రయాణికుల టెర్మినల్ భవన పరిసరాల ఆవరణలో సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించడానికి GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము కఠినమైన నియంత్రణా చర్యలను అమలుపరుస్తోంది.

  • సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించింది
  • అన్ని ఔట్‌లెట్లు పర్యావరణహిత ప్రత్యామ్నాయ సామాగ్రికి మారేలా చేసింది
  • అన్ని ఔట్‌లెట్లు ధృవీకరించబడిన తయారీదారుల నుండి మాత్రమే ఎరువుగా మార్చదగిన ఉత్పత్తులను సమీకరించుకునేలా చేసింది
  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాగ్రి నివారణను కచ్చితంగా పాటించేలా చూసుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తుంది
వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రాసెస్ కంట్రోల్

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్‌లో శబ్దానికి సంబంధించి పరిసర వాయు నాణ్యతా ప్రమాణాలు

GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిపాలనా, ఇంజనీరింగ్ ప్రక్రియలు వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తాయి, అదుపు చేస్తాయి. మా పరిపాలనా వ్యవస్థలు విమానం ల్యాండింగ్ సమయంలో కంటిన్యూస్ డిసెంట్ అప్రోచ్, ఎగిరే సమయంలో కంటిన్యూస్ క్లైంబ్ ఔట్ ఆపరేషన్ ఉండేలా చూస్తాయి. ఇవి విమానాశ్రయం వద్ద వాయు, శబ్ద కాలుష్య స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.

  • ప్రయాణికుల తరలింపు కోసం మేము విద్యుత్ వాహనాలను వాడతాము.
  • విమానం కొరకు మేము ఫిక్స్‌డ్ విద్యుత్ గ్రౌండ్ పవర్ యూనిట్లను అందిస్తాము.
  • మేము DG సెట్స్ ధ్వని అదుపుచేసే ఆవరణను కలిగి ఉన్నాము, కాలుష్య నియంత్రణ మండలి నియమాలకు అనుగుణంగా ఎత్తు పెంచిన చిమ్నీల ద్వారా 100 అడుగుల వద్ద ఉద్గారాలను విడుదల చేస్తాము.
  • వాయు నాణ్యత , పరిసర శబ్ద స్థాయిలను మేము నిరంతరం పర్యవేక్షిస్తాము
  • విమానాశ్రయం వద్ద మేము వాహన ఉద్గారాల కోసం క్రమం తప్పకుండా కాలుష్య తనిఖీలు నిర్వహిస్తాము.

నీటిని పొదుపు చేయడం

వ్యర్థనీటి పునఃవాడకము & రీసైకిల్

వ్యర్థ జలాలను మురుగునీటి శుద్ధి ప్లాంటు (STP)లో శుద్ధి చేస్తారు, అనంతరం ఫ్లషింగ్, మొక్కల పెంపకం కోసం రీసైకిల్ చేస్తారు. STP నుండి వచ్చే కల్మషాన్ని హైదరాబాద్ విమానాశ్రయంలోని మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తారు.

వర్షపు నీటి సంరక్షణ

GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము, 2019లో ACI నుండి అత్యుత్తమ నీటి, వర్షపునీటి యాజమాన్య అవార్డును పొందింది

జల సంరక్షణకు దోహదపడేందుకు GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వర్షపు నీటి సంరక్షణ కట్టడాలు, అనేక ఇతర నీటిపొదుపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము తన అత్యుత్తమ జల, వర్షపునీటి యాజమాన్యమునకు గాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుండి గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నిషన్ – 2019 గుర్తింపు పొందింది.

ఘన వ్యర్థాల నిర్వహణ

మా మొక్కల కోసం నల్ల బంగారం ఉత్పత్తి
విమానాశ్రయంలోని ఆహార వ్యర్థాలు నల్ల బంగారము లేదా ఎరువుగా మారతాయి. ఈ విలువైన సేంద్రియ ఎరువును పచ్చని చెట్ల కోసం ఉపయోగిస్తారు. హైదరాబాద్ విమానాశ్రయంలో రసాయనిక ఎరువులను ఉపయోగించరు.
  • పేపర్, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్, తిరిగి వాడకం కోసం అధీకృత ఏజెన్సీలకు అప్పగిస్తారు.
  • ఈ-వ్యర్థము, హానికరమైన/బయోమెడికల్ వ్యర్థాలను అధీకృత రీసైకిల్ ఏజెన్సీలకు అప్పగిస్తారు.

మీ సహాయానికి ధన్యవాదాలు. మీరు GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము గుండా ప్రయాణిస్తున్నప్పుడు, వ్యర్థాలను పారవేయడానికి సముచితమైన బిన్‌ను ఉపయోగించినట్లయితే, విమానాశ్రయంలో సహజమైన పర్యావరణ వ్యవస్థను నిర్వహించడానికి మేము చేసే ప్రయత్నములో మీరు మాకు సహాయపడుతున్నారన్న మాట.

ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుండి గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ గుర్తింపు 2020

2020 మే నెలలో, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము, అత్యుత్తమ నీటి యాజమాన్యానికి గాను గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ గుర్తింపు 2020ని అందుకొంది. సమర్థవంతమైన మంచినీటి వినియోగం, వ్యర్థ నీటి రీసైక్లింగ్, వర్షపు నీటి సంరక్షణ, నీటి పారుదల నెట్‌వర్క్ ఆటోమేషన్, శీతలీకరణ ప్లాంటు నుండి ఘనీభవించిన నీటి పునరుపయోగం ఈ గుర్తింపుకు దోహదమైన ముఖ్యాంశాలు.

వింగ్స్ ఇండియా మార్చ్ 2020 సందర్భంగా ఏవియేషన్ సస్టెయినబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అవార్డు

GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము తన విమానాశ్రయ భాగస్వాములతో పాటు, విమానాశ్రయము వద్ద హరితతోరణ అభివృద్ధి, సోలార్ విద్యుత్తు వాడకము, హరిత భవనాల నిర్మాణము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ, వ్యర్థ ఆహారం నుండి ఎరువు తయారీ, కర్బన ఉద్గారాల తగ్గింపు, కర్బన తటస్థ విమానాశ్రయ స్థితి నిర్వహణ (లెవెల్ 3+), కమ్యూనిటీ సాధికారత వంటి సుస్థిరమైన విమానాశ్రయ కార్యకలాపాల కారణంగా ఈ గుర్తింపును సాధించింది.

విద్యుత్తు సంరక్షణ

GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము, తన విజయాలకు గాను భారత ప్రభుత్వపు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ నుంచి జాతీయ ఎనర్జీ సంరక్షణ అవార్డులు-2011 లో “మెరిట్ సర్టిఫికెట్” అందుకొంది.

GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము 19వ జాతీయ అవార్డుల సందర్భంగా 2018లో ఎనర్జీ మేనెజ్మెంట్‌లో శ్రేష్టతకు “శ్రేష్టమైన విద్యుత్ సమర్థత యూనిట్” కొరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) అవార్డు అందుకొంది.

పర్యావరణ సమాజపు మద్దతు

వరలక్ష్మి ఫౌండేషన్

అక్షరాస్యత పెంపు, ఆరోగ్య అవగాహనా కల్పన (పారిశుధ్యం, పరిశుభ్రత)పై దృష్టి సారింపుతో పరిసర గ్రామాలలో సుస్థిరమైన మార్పును తీసుకురావడానికి మరియు జీవనోపాధుల్ని కల్పించి, అవగాహనా ఉద్యమాలు మరియు శిక్షణా కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలలో సాధికారత పెంచేందుకు ఫౌండేషన్ పనిచేస్తోంది.

పర్యావరణ పరిరక్షణ పట్ల దృష్టి సారించే నిర్దిష్ట శిక్షణా కార్యక్రమాలలో, జనపనార బ్యాగుల తయారీ, ల్యాండ్‌స్కేప్ నిర్వహణలో శిక్షణ, పాఠశాల పిల్లల కొరకు పర్యావరణ పరిరక్షణపై అవగాహనా కార్యక్రమాలు ఉంటాయి.

పర్యావరణ సంబంధిత పనితీరు పర్యవేక్షణ

GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ – ఎన్విరాన్‌మెంటల్ కంప్లయన్స్ టీం, విమానాశ్రయ పర్యావరణ స్థితిని అంచనా వేయడానికి, విమానాశ్రయ ముఖ్య పనితీరు సూచికలను పర్యవేక్షించడానికి తమ అంతర్గత శాఖలు, భాగస్వాముల నుండి పర్యావరణానికి సంబంధించిన సమాచారాన్ని సమకూర్చుకొంటుంది. ఇందుకు సంబంధించి, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము కోసం ఒక కేంద్రీకృత పర్యావరణ సంబంధిత డేటాబేస్ నిర్వహణకు ఒక ఆన్‌లైన్ పర్యావరణ పోర్టల్‌ను నెలకొల్పారు. ఈ పోర్టల్ ద్వారా విమానాశ్రయ పర్యావరణం నియమనిబంధనలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. అది డేటా యాజమాన్యాన్ని కూడా సులభతరం చేస్తుంది, అంతర్గత భాగస్వాములకు పర్యావరణ సంబంధిత సమాచార లభ్యతను పెంచుతుంది. పర్యావరణ సుస్థిరతను సాధించే దిశగా అడుగులు వేయడానికి ఈ మొత్తం ప్రక్రియ అవసరం. విమానాశ్రయం 25 MPPA నిర్వహణ సామర్థ్యం కోసం పర్యావరణ అనుమతి కూడా పొందింది. ఆ తదనంతరం ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదల, ప్రయాణికుల రద్దీలో అపారమైన పెరుగుదలను నిర్వహించుకోవడానికి విమానాశ్రయం 5O MPPA హ్యాండ్లింగ్ సామర్థ్యం కోసం పర్యావరణ అనుమతి ని పొందింది..

సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ కోఆర్డినేటర్

పేరు: వింగ్ కమాండర్ ఎ.వి. లక్ష్మణ కుమార్ (రిటైర్డ్) (సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ కోఆర్డినేటర్)

హోదా: హెడ్ - సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ కంప్లయన్స్

చిరునామా: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్, హైదరాబాద్ - 500409

AirportCity