వైవిధ్యత
టీమ్ వర్క్
నేర్చుకొనుట
పారదర్శకత

పని చేయడానికి ఇష్టపడే గొప్ప చోటును నిర్మించడం

GHIAL ని “పనిచేయడానికి ఇష్టపడే ఒక గొప్ప చోటు”గా చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. తాము ఏమి చేస్తున్నారో దానికి అంకితమయ్యే, పట్టుదల గల వర్క్ ఫోర్స్ మాకు కావాలి. ఆ కారణం చేతనే మేము అత్యుత్తమ నాణ్యతా సేవలు, కస్టమర్ అనుభవాన్ని అందించాలనే మా లక్ష్యాన్నిసాధించడానికి మాకు సహాయపడే సామర్ధ్యం గల వ్యక్తులను నియమించుకున్నాము.

ఎదుగుదల అవకాశాలు

అంతర్గత ప్రతిభా పాటవాల అభివృద్ధి ప్రక్రియలను GHIAL వ్యవస్థీకృతం చేసింది, తద్వారా ఎదుగుదల అవకాశాలను సృష్టించి, చక్కని వారసత్వాన్ని అందిస్తోంది, ఇవన్నీ కంపెనీ విజయంలో ముఖ్యాంశాలు. నాయకత్వము, అభివృద్ధి పట్ల నిబద్ధతతో, సాధ్యమైనంత అత్యుత్తమ పని వాతావరణాన్ని కల్పించాలనేదే మా లక్ష్యo.
విద్య, శిక్షణ, ప్రోత్సాహకరమైన ఉత్తమ అలవాట్లు ఎదుగుదలను, అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి. ఎవరైనా సరే తాను పనిచేసే అంశములో రాణించడాన్ని ఎంచుకోవచ్చు లేదా తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించేoదుకు పలు విధులలోని అవకాశాలను అందుకోవచ్చు.

వైవిధ్యత మరియు చేకూర్పు

అన్ని రకాల వ్యక్తులు కలిసి పని చేసే వైవిధ్యమైన పని చోటును పెంపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. కలిసి ఉంటేనే ఆవిష్కరణ మొదలవుతుందని మేము నమ్ముతాము. మా జట్టు, ప్రపంచంలోని అతి రద్దీ గల వాటిలో ఒకటైన మా విమానాశ్రయo నిరంతరాయంగా పనిచేయడం కోసం, దేశవ్యాప్తంగా అనేక జాతులు, నేపధ్యాల నుండి వచ్చిన సభ్యులను సంఘటితంగా సమన్వయం చేసుకుంటూ పోతుంది.
ప్రయాణికులకు అత్యుత్తమ స్థాయి నాణ్యతగల సేవలు అందించే ఏకైక లక్ష్యం సాధించడానికై వేర్వేరు భాగస్వాములను సంఘటితం చేసేందుకు, భాగస్వాములందరూ ప్రయాణికుల కేంద్రిత చర్యల్లో భాగంగా ఉండేలా, సమన్వయ స్ఫూరితో పనిచేసేలా చూసుకోవడానికి మేము GMR గ్రూప్ యొక్క మూల విలువల్లో ఒకటైన – ‘టీమ్ వర్క్ మరియు సంబంధ బాంధవ్యాల’కు అనుగుణంగా 'వన్ ఫ్యామిలీ – వన్ మిషన్' అనే విశిష్టమైన ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటు చేశాము.

పని తర్వాత

పని పాటలలో సరదాలు ఎల్లప్పుడూ ఉద్యోగ జీవితానికి అదనపు పరిమళాన్ని జోడిస్తాయి, టీం వర్క్‌ను, తమది అనే భావనను బలోపేతం చేస్తాయి. WAVES అనేది GHIALలో క్రాస్ ఫంక్షనల్ ఈవెంట్ జట్టుగా ఉంది. వారు క్రమం తప్పకుండా కలుసుకొని, వివిధ వినోద కార్యక్రమాలు, పండుగ సంబరాలు ఇంకా ఇతర వేడుకలను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తారు. మా ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమం “ఆయుషి”, ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్‌నెస్ మెరుగు పరచడానికై వివిధ భౌతిక,మానసిక ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తోంది.