No Items Found


ప్రయాణికులు విమానాశ్రయములో వదిలి వెళ్ళిన తమకు చెందిన వస్తువులను తిరిగి పొందడానికి గాను సంబంధిత ఎయిర్‌లైన్స్ వారిని సంప్రదించాలి.
ఒకవేళ మీరు మీకు చెందిన వస్తువులను వేటినైనా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయములో పొరపాటుగా ఉంచిన/ పోగొట్టుకున్న పక్షములో, మీరు స్వయంగా, ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఈ క్రింద ఇవ్వబడిన సమాచారం ప్రకారము లాస్ట్ & ఫౌండ్ డిపార్ట్‌మెంట్ వారిని సంప్రదించవచ్చు:


పోగొట్టుకున్నవి మరియు దొరికిన వస్తువులను క్లెయిము చేసుకోవడానికి పనిచేసే వేళలు 24/7.

ఈ క్రింది డాక్యుమెంట్లను సరిచూసుకున్న మీదట వస్తువులను ప్రయాణికుడికి అప్పగిస్తారు:

  • బోర్డింగ్ కార్డు
  • ఫోటో గుర్తింపు కార్డు (పాస్‌పోర్ట్ /పాన్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/వోటర్ ID కార్డు)
  • వస్తువు అతనికి/ఆమెకే చెందినదని నిర్ద్వంద్వంగా నిరూపించే ఋజువు.

ఒకవేళ మీరు వస్తువును తీసుకోవడానికి మీ తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తున్నట్లయితే, దయచేసి పై డాక్యుమెంట్లతో పాటుగా అదనంగా ఈ క్రింది వాటిని అందజేయండి:

  • వస్తువు వివరణతో పాటు ప్రయాణికుడి నుండి అధీకరణ లేఖ
  • ప్రతినిధి యొక్క ఫోటో గుర్తింపు ఋజువు (పాస్‌పోర్ట్ /పాన్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/వోటర్ ID కార్డు)

డాక్యుమెంట్లను మాకు ఈమెయిల్ చేయవచ్చు మరియు సేకరించుకునే తేదీని తెలియజేయాల్సిందిగా మేము ప్రయాణికులను కోరతాము, తద్వారా వారు రాగానే వస్తువులను అందుబాటులో ఉంచడం జరుగుతుంది.


పోగొట్టుకున్న మరియు దొరికిన వస్తువుల నిల్వ:

పోగొట్టుకున్న ప్రయాణికుడు మూడు నెలల వ్యవధి పాటు వస్తువుల్ని క్లెయిము చేయకపోతే, వాటిని వదిలించుకోవడం జరుగుతుంది. చెడిపోదగిన మరియు నిల్వ చేయడానికి సరిపోని వస్తువులను 24 గంటల లోపున పారవేయడం జరుగుతుంది. ఎటువంటి రకాల తదుపరి క్లెయిముకైనా విమానాశ్రయం బాధ్యత వహించదు.

మూడు నెలల వ్యవధి పాటు పోగొట్టుకున్న, దొరికిన వస్తువుల వివరాలు వెబ్‌సైట్ పైన అందుబాటులో ఉంటాయి.


నిర్బంధిత వస్తువులు:
భద్రతా నియంత్రణ వద్ద జప్తు చేయబడిన వస్తువులు, గణనీయమైన విలువ కలిగినవి మినహాయించి, తిరిగి ఇవ్వబడవు లేదా వాటికి పరిహారం ఇవ్వరు.

మీకు ఏదైనా తదుపరి సమాచారం కావలసివస్తే, దయచేసి మాకు ఈమెయిల్ చేయండి, ఫోన్ చేయండి లేదా ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్‌పోర్ట్ విలేజ్‌నందున్న సమాచార డెస్క్ వద్ద మమ్మల్ని స్వయంగా సంప్రదించండి.


బహిరంగ ప్రకటన - ఎయిర్‌పోర్ట్ వద్ద పోగొట్టుకున్న మరియు దొరికిన వస్తువులు

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్, శంషాబాద్, హైదరాబాద్ ("RGIA") వద్ద ఉన్న పోగొట్టుకున్న, దొరికిన వస్తువులు గడచిన తొంభై (90) రోజులుగా ఎటువంటి క్లెయిము దాఖలు చేయబడని వాటి వివరాలు మా వెబ్‌సైటులో అందుబాటులో ఉన్నాయి, అటువంటి వాటిని వదిలించుకోవాలని ప్రతిపాదిస్తున్నామని GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ ("GHIAL") ఇందుమూలముగా ప్రజానీకానికి తెలియజేస్తోంది. అవి తమవే అనడానికి రుజువులు, గుర్తింపును సమర్పించడం ద్వారా వస్తువులను క్లెయిము చేసుకోవడానికి ఏ క్లెయిముదారుకైనా ఇందుమూలముగా అంతిమ అవకాశము ఇస్తున్నాము. అలా విఫలమైన పక్షములో వస్తువులను వేలం వేయడం జరుగుతుంది. అట్టి వస్తువులకు లేదా వాటి నుండి వచ్చిన రాబడులకు ఏ క్లెయిము అయినా సరే అంగీకరించము.