మీ సంపూర్ణ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశాలు
RGIA, భారతదేశంలో ACI చే డైరెక్టర్ జనరల్ యొక్క రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ లోనికి చేర్చబడిన ఏకైక విమానాశ్రయంగా
కూడా ఉంది. వాస్తవానికి, ఇది తాను అందిస్తున్న సౌకర్యాలు, సేవలు, మౌలిక సదుపాయాల రీత్యా భారతదేశంలో
అత్యంత ఎక్కువ అవార్డులు పొందిన విమానాశ్రయం. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్
(GHIAL) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము(RGIA)ను నిర్వహిస్తోంది. అందువల్ల GHIALలో
పనిచేయడం అంటే, ప్రపంచంలోనే ఒకానొక అత్యుత్తమ విమానాశ్రయంలో పనిచేసే అవకాశం మాత్రమే కాకుండా,
భారతదేశంలోని అత్యుత్తమ విమానయాన రంగ నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం లభించినట్టే. ఈ రంగంలోని
నిపుణులతో పాటుగా పని చేసే అవకాశము నిజంగా సరిసాటిలేనిది. GHIAL వద్ద, మీకు చేతనైనంత వరకూ
అత్యుత్తమంగా దోహదపడేందుకు మీకు స్ఫూర్తి కలిగించే పని వాతావరణాన్ని మేము అందిస్తాము.
GHIAL యందు చేరడానికి ప్రధాన కారణాలు
మీరు స్ఫూర్తి , సాధికారత, ప్రోత్సహo అందించే కెరీర్ కావాలని ఎదురు చూస్తుంటే, GHIAL మీకు సరైన చోటు.
GHIALలో పని చేస్తూ అనేకమంది తమ కెరీర్లో ఎలా ప్రభావితమయ్యారో చెప్పడానికి అసంఖ్యాకమైన కారణాలు
ఉన్నాయి. ఈ క్రిందివి ఆ కారణాలలో కేవలం కొన్ని మాత్రమే:
- RGIA 2009 నుండి వరుసగా ప్రపంచంలోని 3 అత్యుత్తమ విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తించబడింది
- మౌలిక సదుపాయాలు, ఆతిథ్య రంగములో విశిష్ట సేవలు అందించినందుకు గాను RGIA అనేక అవార్డులను
స్వంతం చేసుకొంది.
- భారత విమానయాన రంగంలోని కొందరు అత్యుత్తమమైన వ్యక్తులు ఒక జట్టుగా ఏడాదికి 3 మిలియన్
ప్యాసెంజర్ల నిర్వహణ ,సేవల కోసం 24/7 పని చేస్తూ మా వద్ద ఉన్నారు కాబట్టి మేము దీనిని సాధించాము
- అంతర్జాతీయ విమానయాన రంగములోని నిపుణులచే స్ఫూర్తి, సాధికారత, ప్రోత్సహo అందించే కెరీర్ కావాలని
మీరు ఎదురు చూస్తుంటే
- మీ అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించి, కలసి పనిచేయాలని మీరు ఎదురు చూస్తుంటే, GHIAL మీకు
అనువైన చోటు.
- మీ సంపూర్ణ సామర్థ్యమును తెలుసుకొని మరింత ఎదగడం కోసం
- పోటీకరమైన వేతనాలు, చక్కని ప్రోత్సాహకాలు, ఇంకా ఉచిత ఆన్‌లైన్ శిక్షణా కోర్సుల ప్రయోజనాలతో
లాభం పొందండి
- పారదర్శకమైన పనితీరు, నిష్కల్మషమైన మాటతీరు ఇంకా నిజాయితీకి, నైతిక వ్యాపార విధానాలకు కట్టుబడి
ఉండే స్ఫూర్తిదాయక నాయకత్వంచే స్ఫూర్తి పొందడం ద్వారా సాధికారత పొందండి
- ప్రజలను గొప్ప ఆస్తిగా పరిగణించి అందరినీ కలుపుకు పోయే వైవిధ్యమైన సంస్కృతి.
- స్థానిక ప్రజలను, పర్యావరణాన్ని మెరుగుపరచాలనే నిబద్ధత.
"రైట్ సోదరులు వ్రాత ఆవిష్కరణ జరిగినప్పటి నుండీ ఏకైక అతిగొప్ప సాంస్కృతిక శక్తిని సృష్టించారు. విమానము ప్రజల్ని,
భాషల్ని, ఆలోచనల్ని, ఇంకా విలువలను సంఘటితపరిచే మొదటి వరల్డ్ వైడ్ వెబ్ గా మారింది. - బిల్ గేట్స్"
"
మూల విలువలు
మొట్టమొదట ప్రారంభమైనప్పటి నుండీ, GMR యొక్క 7 మూల విలువలు GHIAL సంస్కృతిలో ప్రతి భాగాన్నీ
తీర్చిదిద్దాయి. GHIAL లో అత్యంత సంతృప్తికరమైన అనుభవాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రజలు
మా అత్యంత గొప్ప ఆస్తిగా మేము భావిస్తాము, మా ప్రయాణికులు, భాగస్వాములు, సమాజాలు, ఇంకా ప్రతి ఒక్కరితో-
సంఘటితంగా, క్రియాశీలకంగా నిమగ్నమై ఉంటాము.
కార్యాచరణలో మా విలువలు
కార్పొరేట్ సామాజిక బాధ్యత
మా పర్యావరణహిత కార్యక్రమాలు
అవార్డులు మరియు
ప్రశంసలు