GHIAL సామాజిక సేవా కార్యకలాపాలు

RGIA కార్యనిర్వహణ ప్రారంభించే 3 సంవత్సరాలకు ముందు GHIAL సామాజిక సేవా కార్యకలాపాలు 2005లో మొదలయ్యాయి. శిక్షణ పొందిన సామాజిక-సేవా కార్యకర్తల బృందము ముందుండి దీనిని నడిపించింది.

ఈరోజున, వరలక్ష్మి ఫౌండేషన్ 6 గ్రామాలలో సమీకృతమైన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది మరియు RGIA చుట్టుపట్ల 23కు పైగా గ్రామాలలో అవసరానికి తగిన సేవలను అందిస్తోంది.

విజన్

అట్టడుగు స్థాయి కార్యక్రమాల ద్వారా విద్య, ఆరోగ్యము, వృత్తిపరమైన శిక్షణలో సుస్థిరమైన ఎదుగుదలను అందించడం, స్థానిక ప్రజలకు సాధికారత చేకూర్చడం మా లక్ష్యం.

లక్ష్యం మరియు సాధించింది

ఈ లక్ష్యంపై దృష్టి సారిస్తూ, 6 గ్రామాలలో సమగ్రమైన కార్యక్రమాలు చేపట్టారు. విమానాశ్రయం చుట్టుపక్కల 23 గ్రామాలలో వివిధ ఇతర విస్తరణ సేవలు వ్యాప్తి చేసారు. ఈ కార్యక్రమాల సరళి, అవసరమైన కార్యక్రమాలతో విద్య, ఆరోగ్యము, జీవనోపాధుల విషయంలో ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తారు.

విజయగాధ

సమ్రీన్ తన కలలను సాకారం చేసుకొంది

ప్రతిభావంతురాలైన, అర్హురాలైన చిన్నారి తన సంపూర్ణ సామర్థ్యాలను ఉపయోగించుకొంది

సమ్రీన్ ఫాతిమా శంషాబాద్ గ్రామములో పుట్టి పెరిగింది. ఆమె తల్లిదండ్రులు చదువురాని వాళ్ళు. సమ్రీన్‌కు నలుగురు తోబుట్టువులు. ఆ కుటుంబం శంషాబాద్ గ్రామములో ఒక అద్దె ఇంట్లో ఉండేవారు.

సమ్రీన్ శంషాబాద్ గ్రామములో ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలో 4 వ తరగతి వరకూ చదువుకొంది. ప్రతిభావంతుల పిల్లల కమిటీ ఈ అమ్మాయిని గుర్తించి, ఆమెను 2008లో ఈ పథకానికి ఎంపిక చేసి, GMR చిన్మయ విద్యాలయలో చేర్చుకొంది.

ఆమె మొదట్లోనే తాను ఒక ఇంజనీర్ కావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకొంది. ఆమె చదువుకు సంబంధించిన ఖర్చులను చెల్లించడంతో పాటుగా, GHIAL CSR ఆమెకు సాయంత్రపు ట్యూషన్లు, క్రమం తప్పకుండా కౌన్సెలింగ్, కెరీర్ గైడెన్స్, అదనపు విద్యావిషయాలతో సహాయాన్ని అందించింది.

ఈ అవకాశాన్ని గుర్తించి సమ్రీన్ ఎంతో ఉత్సాహంగా అడ్డంకుల్ని అన్నింటినీ ఎదుర్కొని చదువులో బాగా రాణించింది. ఇంటర్మీడియేట్ తర్వాత, ఆమెకు మంచి EAMCET ర్యాంకు రాగా మెకానికల్ ఇంజనీరింగ్ చేయడానికి ఒక పేరొందిన కాలేజీలో ఉచితంగా సీటు లభించింది. ఇప్పుడు ఆమె మెకానికల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరంలో ఉంది.

Values

కొన్ని ప్రధానమైన ముఖ్యాంశాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి

2008 నుండీ ఇప్పటివరకు 35,000 మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విద్యా సంబంధిత కార్యకార్యక్రమాలు

మేము పని చేస్తాము

చదువు నాణ్యత పెంచడానికి

  • 12 ప్రభుత్వ పాఠశాలలు – ప్రతి సంవత్సరం 4000 మందికి పైగా విద్యార్థులు
  • ప్రతి సంవత్సరమూ 10 ప్రీ-స్కూల్స్ - 300 మంది పిల్లలు

అందించేవి

  • టెక్నాలజీ తోడ్పాటు - కిడ్‌స్మార్ట్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్లు
  • సహాయ ఉపాధ్యాయులు, త్రాగు నీరు, పరిశుభ్రమైన టాయిలెట్లు, అభ్యసన సామాగ్రి, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల శిక్షణ, వర్క్‌షాప్‌లు మొ.

GMR చిన్మయ విద్యాలయ

ఈ పరిసర ప్రదేశాల్లోని పిల్లలకు తక్కువ ఖర్చులో చదువును అందించే ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ స్కూల్ . 2008 నుండీ ఇప్పటివరకూ GMR చిన్మయ విద్యాలయ 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలను సాధిస్తూ వస్తోంది

అందించేవి

గిఫ్టెడ్ చిల్డ్రన్ స్కీమ్

  • చుట్టుపట్ల గ్రామాలకు చెందిన అణగారిన వర్గాలలోని ప్రతిభావంతులైన పిల్లల కొరకు పూర్తిగా నిధులు సమకూర్చిన విద్యా ఉపకార వేతనాలు. ప్రస్తుతం, 124 మంది విద్యార్థులు కిండర్‌గార్డెన్ నుండి డిగ్రీ కోర్సుల వరకూ లబ్ధి పొందుతున్నారు.

2006 నుండీ 300,000 మంది వ్యక్తులకు పైగా ఉచిత ఆరోగ్య సేవలు

అందించేవి

మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)

  • ఒక మొబైల్ మెడికల్ యూనిట్ (MMU) ఇరుగు పొరుగు గ్రామాలలో వయో వృద్ధులకు (55+ వయో సమూహం) సేవలు అందిస్తోంది. క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన డాక్టరు, ఫార్మసిస్టు, సామాజిక కార్యకర్త అందుబాటులో ఉంటారు
  • ప్రతి వారమూ 800కి పైగా లబ్దిదారులకు ఉచిత వైద్య సంప్రదింపు, మందులు ఇవ్వబడుతున్నాయి, సంవత్సరానికి 23 గ్రామాలలో, 20,000 చికిత్సలు జరుగుతున్నాయి

ఈవెనింగ్ క్లినిక్కులు

  • 7 గ్రామాలలో అన్ని వయసులలో ఉన్న దాదాపు 800 మంది కమ్యూనిటీ సభ్యులకు ప్రతి నెలా ఉచిత చికిత్స, మందులు అందిస్తున్న ఈవెనింగ్ క్లినిక్కులు

ఆర్‌ఓ ప్లాంట్లు

  • విమానాశ్రయ పునరావాస కాలనీ, గొల్లపల్లి గ్రామములో నెలకొల్పబడిన రెండు ఆర్‌ఓ నీటి శుద్ధి ప్లాంటులు, ప్రతిరోజూ సుమారు 600 గృహాలకు ప్రయోజనం కలిగిస్తున్నాయి

స్కూల్ ఆరోగ్య పరీక్షలు

  • ప్రీ-స్కూల్/ప్రాథమిక పాఠశాల పిల్లల కొరకు రెగ్యులర్ హెల్త్-చెకప్‌లు, ప్రతి సంవత్సరమూ సుమారు 1200 నుండి 1500 మంది పిల్లలకు చెకప్ చేస్తున్నాయి.

పోషకాహార కేంద్రాలు

  • మూడు గ్రామాలలో గర్భిణీ స్త్రీలు/పాలిచ్చే తల్లుల కొరకు పోషకాహార కేంద్రం ద్వారా అనుబంధ సహాయం. కేలరీలు, ఐరన్, ఫోలిక్ ఆసిడ్, మొదలగు వాటి లోపాలను భర్తీ చేయడానికి దైనందిన ఆహార అనుబంధ పోషకాలు. 2006 నుండీ ఇప్పటివరకూ 1500 మందికి పైగా మహిళలకు ఆరోగ్య అవగాహనా సదస్సులు, మెరుగైన పోషకాహారం, ముందస్తు గర్భధారణ /అనంతర అవగాహనతో 95% కి పైగా ఆసుపత్రిలో కాన్పులు, ఇమ్యూనైజేషన్ ఫాలో-అప్, సగటు శరీర బరువు 3.0 కిలోలుగా ఉండడానికి దారితీసింది.

ఆరోగ్య శిబిరాలు

  • ప్రతి సంవత్సరమూ క్రమం తప్పకుండా నేత్రవైద్య శిబిరాలు, సాధారణ వైద్య శిబిరాలు, వికలాంగులకు తోడ్పాటు మొదలైనవి నిర్వహించబడుతున్నాయి.

సాధికారత మరియు జీవనోపాధులు

పాఠశాల, కాలేజ్ డ్రాప్-అవుట్ యువత నైపుణ్యాభివృద్ధి కొరకు స్వల్ప-కాలిక, ఉద్యోగ- ఆధారిత కోర్సుల కోసం రెసిడెన్షియల్ వొకేషనల్ శిక్షణా కేంద్రము. ఈ సెంటర్ ప్రస్తుతం 11 వృత్తివిద్యా కోర్సులను అందిస్తోంది.

వోల్టాస్, ష్నీడర్, హీరో మోటొ కార్ప్, వోల్వో, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, మారుతి డ్రైవింగ్ స్కూల్ మొదలైన పారిశ్రామిక భాగస్వామ్యాలతో కోర్సులు నిర్వహిస్తున్నారు.

2006 నుండీ ఇప్పటివరకూ 89% సెటిల్మెంట్ రేటుతో 10000 మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ, ఉద్యోగ నియామకాలు అందించారు.

ఎంపవర్ (మహిళా ఔత్సాహికవేత్తల ఉత్పత్తుల మార్కెటింగ్ సహాయం) ఈ కార్యక్రమం మహిళలకు టైలరింగ్‌లో ఆదాయాన్నిచ్చే శిక్షణను, జనపనార ఉత్పత్తులు తయారు చేయడంలో ప్రత్యేకమైన శిక్షణ, యూనిఫారం కుట్టడం, బ్యాగుల తయారీ, చాకొలెట్ తయారీలో శిక్షణలను ఇస్తుంది. మేము ఆఫీస్ సేల్స్, సదస్సులు, మహాసభలకు టోకున ఆర్డర్లు కూడా తీసుకుంటాము, మాకు ఆన్‌లైన్ స్టోర్ కూడా ఉంది. 2018 ఆర్థిక సంవత్సరములో వందలాది మహిళలు, చేతివృత్తులవారికి ప్రయోజనం కలిగిస్తూ రు.70 లక్షల టర్నోవరు జరిగింది.

CSR కార్యక్రమాలలో ఉద్యోగుల భాగస్వామ్యం

  • కమ్యూనిటీ అభివృద్ధి, సామాజిక సత్కార్యాల దిశగా సమయాన్ని కేటాయించాలని, కృషి చేయాలని GMR గ్రూపు తన ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది.
  • GHIAL CSR విభాగము GHIAL ఉద్యోగులు కమ్యూనిటీ అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
  • GMR గ్రూపు సామాజిక స్వచ్ఛంద సేవా ప్రాజెక్టుల (SVP) పథకము, సామాజికంగా బాధ్యత గల కమ్యూనిటీ కార్యక్రమాలలో GMR ఉద్యోగులు/ కుటుంబాలు క్రియాశీలక పాత్ర పోషించడానికి అవకాశం కల్పిస్తుంది. తమకు నచ్చిన ఒక ప్రదేశంలో, కమ్యూనిటీలో తమకు నచ్చిన ఏదైనా సామాజిక పథకములో పాల్గొని, పని చేయడానికి స్వచ్ఛంద కార్యకర్తల సమూహాలను ఏర్పాటు చేయాలని ఉద్యోగులను ఆహ్వానిస్తారు.

కమ్యూనిటీ అభివృద్ధి

  • విమానాశ్రయము చుట్టూ గల గ్రామాల నుండి 800 మందికి పైగా అభ్యర్థులు విమానాశ్రయంలో వివిధ కాంట్రాక్టర్ల వద్ద తగినఉద్యోగాలతో నియమితులై ఉన్నారు
  • ప్రాజెక్టు గ్రామాలలో డ్రైనేజ్ పనులు చేపట్టడం, వీధి లైట్లు మొదలగువంటి చిన్న మౌలిక సదుపాయాల పనులు
  • అంగన్‌వాడీల పెయింటింగ్ మరియు పునరుద్ధరణ పనులు
  • 3 గ్రామాలలో సుమారుగా 3000 మంది వ్యక్తులకు సేవలందిస్తూ కమ్యూనిటీ గ్రంధాలయాలు

ఉద్యోగుల భాగస్వామ్యం వివరాలు