హెచ్చరికా ప్రకటన
కొందరు మోసకారులైన వ్యక్తులు దురుద్దేశముతో తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించాలనుకొని మరియు/లేదా
ఉద్యోగార్థులు, విద్యార్థులను మోసగించాలనే ఉద్దేశ్యముతో తమను తాము GMR గ్రూపు (మరియు దాని అనుబంధ/గ్రూప్
కంపెనీలు) యొక్క ఉద్యోగులు/ ప్రతినిధులు/ ఏజెంట్లమని చెప్పుకుంటూ, GMR గ్రూపులో వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని
తప్పుడు మార్గాల్లో కొన్ని వెబ్‌సైట్లు/లేదా టెలిఫోన్ కాల్స్ లేదా నకిలీ లేఖల ద్వారా, ఫలానా బ్యాంకు ఖాతాలలో కొంత నిర్దిష్ట
మొత్తాన్ని డిపాజిట్ చేయమని అడుగుతున్నట్లుగా మాకు తెలిసింది. GMR గ్రూపు కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసే
ఉద్దేశ్యముతో ఈ వ్యక్తులు అనధికారికంగా GMR పేరు, ట్రేడ్ మార్క్, డొమైన్ పేరు, లోగోను ఉపయోగించుకుంటున్నారు.
అటువంటి వ్యక్తులకు ఆన్‌లైన్ ఉద్యోగాలు అందజూపడానికి గానీ లేదా ఏవైనా లేఖలు జారీ చేయడానికి లేదా మా తరఫున
పని చేయడానికి గానీ లేదా మా పేరు, ట్రేడ్‌మార్క్ మరియు లోగో/ వెబ్‌సైట్‌లు ఉపయోగించుకోవడానికి గానీ GMR గ్రూపు
(మరియు దాని అనుబంధ/గ్రూప్ కంపెనీలు) ఏ వ్యక్తినీ లేదా ఏజెన్సీని నియమించలేదు లేదా అధీకృతపరచలేదని
ఇందుమూలంగా మేము సాధారణ ప్రజానీకాన్ని హెచ్చరిస్తున్నాము.
సాధారణ ప్రజానీకము కూడా అట్టి మోసపూరితమైన తప్పుడు కార్యక్రమాలకు మోసపోవద్దని సలహా ఇస్తున్నాము. GMR
గ్రూపు (మరియు దాని అనుబంధ/గ్రూప్ కంపెనీలు), ఆన్‌లైన్ లేదా ఇతరత్రా దరఖాస్తు చేసినా లేదా మాకు దరఖాస్తు
చేయబోయే అభ్యర్థులు/ ఉద్యోగ దరఖాస్తుదారులు/ ఉద్యోగార్థుల నుండి ఉద్యోగం పొందడానికి ఏ రూపములోనూ
డబ్బును అడగదు, కోరదు లేదా స్వీకరించదు. GMR గ్రూపు (మరియు దాని అనుబంధ/గ్రూప్ కంపెనీలు) అట్టి ఆఫర్లకు
జవాబుగా అక్కడ డిపాజిట్ / విత్‌డ్రా చేసుకున్న మొత్తాలకు ఎటువంటి బాధ్యతా వహించదు.
GMR గ్రూపు (మరియు దాని అనుబంధ/గ్రూప్ కంపెనీలు) తమ స్వంత హెచ్ఆర్ విభాగము ద్వారా ఒక క్రమబద్ధమైన
నియామక ప్రక్రియను అనుసరిస్తాయి తప్ప ఉద్యోగుల అంతిమ ఎంపికను ఎవరేని వ్యక్తులు లేదా ఏజెన్సీలకు
అప్పగించవు అని గమనించగలరు. అటువంటి నకిలీ ఇంటర్వ్యూ కాల్స్ తో వ్యవహరించేవారు ఎవరైనా దానిని అతని/
ఆమె స్వంత రిస్కుతో చేస్తుంటారు. అట్టి వ్యక్తుల వల్ల ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ జరిగిన ఏదేని నష్టం లేదా
డ్యామేజీకి GMR గ్రూపు లేదా దాని అనుబంధ/గ్రూప్ కంపెనీలు బాధ్యత వహించబోవు. అర్హులైన ఉద్యోగార్థులు అట్టి
విజ్ఞప్తులకు స్పందించకూడదని కంపెనీ సిఫార్సు చేస్తోంది.
GMR గ్రూపు (మరియు దాని అనుబంధ/గ్రూప్ కంపెనీలు)తో నియామకము లేదా ఉద్యోగానికి సంబంధించి మీకు ఏదైనా
అట్టి మోసపూరిత సంఘటన తెలిసినా, లేదా మీ వద్ద ఏదైనా సమాచారము ఉన్నా, దయచేసి అటువంటి తప్పుడు
చర్యలను అరికట్టడానికి తగు చర్య తీసుకోవడంలో మాకు సహకరించండి.