జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ వద్ద వర్తించే సినిమాటోగ్రఫీ / ఫోటోగ్రఫీ / వీడియోగ్రఫీ నియమనిబంధనలు

తగిన మార్గదర్శకాలను నెలకొల్పడం ఈ నియమ నిబంధనల ఉద్దేశ్యము, వీటి క్రింద GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (GHIAL), ద్వారా పనిచేసే ముఖ్య కార్యనిర్వాహక అధికారి (CEO) లేదా ఆయనచే అధికారం ఇవ్వబడిన ఎవరేని వ్యక్తి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA), హైదరాబాద్ ఆవరణములో వాణిజ్యపరమైన వాడకం, బహిరంగ ప్రదర్శన, ప్రచురణ, లేదా ప్రదర్శన కోసం స్టిల్, కదిలే చిత్రాలు, లేదా వీడియోగ్రఫీ తీసుకోవడానికి లేదా ఏదైనా కదిలే చిత్రం, టెలివిజన్ కార్యక్రమం చిత్రీకరణ చేయడానికి లేదా వాణిజ్య ప్రకటన చేయడానికి అనుమతు/లను కోరుతున్న వ్యక్తుల నుండి అభ్యర్థనలను పరిగణించవచ్చు. స్టిల్ లేదా కదిలే చిత్రాలు లేదా వీడియోగ్రఫీని తీసుకోవడానికి ఈ నియమాలు వర్తించవు;

  • విమానాశ్రయ వాడుకదారుల వ్యక్తిగత మరియు వాణిజ్యేతర అవసరాలకు
  • విమానాశ్రయ సిటీ సైడ్‌లో వార్తాప్రముఖమైన ఈవెంట్లను కవర్ చేయడానికి వచ్చే పత్రికలు లేదా న్యూస్ మీడియా.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క ఎయిర్‌సైడ్‌లో వాణిజ్యపరమైన వాడకం, బహిరంగ ప్రదర్శన, ప్రచురణ, లేదా ప్రదర్శన కోసం స్టిల్, కదిలే చిత్రాలు, సినిమాటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ తీసుకోవడం లేదా ఏదైనా కదిలే చిత్రం, టెలివిజన్ కార్యక్రమం చిత్రీకరణ చేయడం లేదా వాణిజ్య ప్రకటన చేయడం నిషేధించబడింది.

ఒక వ్యక్తి ఉద్దేశ్యిత కార్యక్రమాన్ని చేపట్టుటకు గాను ఈ క్రింది పత్రాలను, అనుమతులను సమర్పించి, ముందుగా నిర్దిష్టమైన చెల్లింపులను చేసి ఉంటే తప్ప, అట్టి వ్యక్తి విమానాశ్రయ ప్యాసెంజర్ టెర్మినల్‌కే పరిమితం కాకుండా విమానాశ్రయము యొక్క ఏ భాగముపై అయినా కానీ వాణిజ్య వాడకము లేదా బహిరంగ ప్రదర్శన లేదా డిస్‌ప్లే కొరకు ఎటువంటి స్టిల్ లేదా కదిలే చిత్రాలు లేదా వీడియో టేపులను తీసుకోరాదు లేదా ఎటువంటి కదిలే చిత్రం, టెలివిజన్ కార్యక్రమం లేదా వాణిజ్య వ్యాపార ప్రకటన యొక్క చిత్రీకరణ చేయరాదు:

దరఖాస్తుదారు, ఉద్దేశించిన చిత్రీకరణకు కనీసం 10 రోజులకు ముందుగా, జీహెచ్‌ఐఏఎల్ ఆమోదించే ఏదైనా ఒక ఫార్మాట్‌లో ఒక పర్మిట్ దరఖాస్తును పూర్తి చేసి, సమర్పించాలి.

దానిని హెడ్ – కార్పొరేట్ కమ్యూనికేషన్స్, జీహెచ్‌ఐఏఎల్ మరియు సీఈఓ – జీహెచ్‌ఐఏఎల్ సమీక్షించి, ఆమోదిస్తారు.

పాలసీ షరతులకు లోబడి పర్మిట్ జారీ చేయబడుతుంది. అవసరమైన రుసుములను చెల్లించిన తర్వాత, పౌర విమానయాన భద్రత బ్యూరో (బీసీఏఎస్), పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డిజిసిఏ), భారత ప్రభుత్వం వారిచే నిర్దేశించబడిన నియమ నిబంధనల ప్రకారము పాల్గొనేవారందరూ నిర్బంధిత కేటాయిత స్థలాల లోనికి ప్రవేశించడానికి వీలుగా దరఖాస్తుదారులందరికీ జీహెచ్‌ఐఏఎల్ విమానాశ్రయ ప్రవేశ పర్మిట్‌ను ఇస్తుంది.

చిత్రీకరణ కొరకు జారీ చేయబడే ప్రవేశ పాస్‌ల సంఖ్యను పరిమితం చేయడానికి జీహెచ్‌ఐఏఎల్‌కు సంపూర్ణ, విచక్షణాయుతమైన హక్కులున్నాయి.

విమానాశ్రయం లేదా దాని ఆస్తిలో ఫోటోగ్రఫీ / వీడియోగ్రఫీ / సినిమాటోగ్రఫీ మరియు వాణిజ్యపరమైన వాడకము, బహిరంగ ప్రదర్శన, లేదా డిస్‌ప్లే కొరకు లేదా ఏదైనా కదిలే చిత్రం, టెలివిజన్ ప్రోగ్రామ్, లేదా వాణిజ్య ప్రకటనను చిత్రీకరించడానికి, ఈ పత్రానికి జత చేయబడిన షెడ్యూల్-ఎ లో ప్రచురించిన విధంగా, వర్తింపును బట్టి, జీహెచ్‌ఐఏఎల్‌కు నిర్దిష్ట ఛార్జీలు చెల్లించాలి.

ఛార్జీలను ముందుగానే చెల్లించవలసి ఉంటుంది, ఒకసారి చెల్లించిన ఛార్జీలను తిరిగి ఇవ్వరు. అయినప్పటికీ, ఏ కారణం చేతనైనా అట్టి కార్యక్రమం రద్దు అయిన పక్షములో, జీహెచ్‌ఐఏఎల్‌ విచక్షణ మేరకు, అట్టి రద్దుకు 24 గంటల ముందుగా లిఖితపూర్వకంగా కి తెలియజేసినట్లయితే, కేవలం 50% మొత్తము మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది.

కార్యకలాపాలకు సంబంధించిన అన్ని నష్టాలు మరియు /లేదా జీహెచ్‌ఐఏఎల్‌ విమానాశ్రయ ఆస్తులకు కలిగే నష్టాన్ని మరియు ఉత్పన్నం కాగల ఏవేని తృతీయ పక్ష క్లెయిములను భర్తీ చేసుకోవడానికి గాను ఈ డాక్యుమెంటుకు జతపరచబడిన షెడ్యూల్ A లో కనబరచిన, వర్తించదగిన, ప్రచురించబడిన మొత్తానికి దరఖాస్తుదారు ఒక సమీకృత బీమా పాలసీ తీసుకోవాలి.

బీమా కంపెనీచే దరఖాస్తుదారు క్లెయిము స్వీకారము లేదా తిరస్కరణతో సంబంధం లేకుండా, జీహెచ్‌ఐఏఎల్ మరియు/లేదా తృతీయ పక్షం (విమానాశ్రయ వాడుకదారు/ల) యొక్క అన్ని క్లెయిములను ఎటువంటి నిలదీత లేదా నిరసన లేకుండా పరిష్కరించడానికి దరఖాస్తుదారు ఒక్కరే బాధ్యులు. ఈ విషయానికి సంబంధించి, ఏది ఏమైనా సరే, ఎటువంటి అభ్యంతరాన్నీ లేవనెత్తనని దరఖాస్తుదారు నిర్ధారిస్తారు.

ఈ డాక్యుమెంటుకు జతపరచబడిన షెడ్యూల్ A లో వర్తించదగిన, ప్రచురించబడిన మొత్తానికి దరఖాస్తుదారు వడ్డీ లేని తిరిగి చెల్లించదగిన సెక్యూరిటీ ధరావత్తు చెల్లించాలి.

సెక్యూరిటీ ధరావత్తును తిరిగి ఇవ్వడానికి ముందు, జీహెచ్‌ఐఏఎల్‌కు దరఖాస్తుదారు చెల్లించాల్సిన ఏవేని మరియు అన్ని పెండింగ్ బకాయీలు ఈ సెక్యూరిటీ ధరావత్తు నుండి మినహాయించుకోబడతాయి. తర్వాత, ఒకవేళ జీహెచ్‌ఐఏఎల్‌ యొక్క విమానాశ్రయ ఆస్తికి ఏదైనా నష్టం జరిగిన పక్షములో, దరఖాస్తుదారు జీహెచ్‌ఐఏఎల్‌‌తో అట్టి క్లెయిమును పరిష్కరించుకునే సమయం వరకూ వారి సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇవ్వడం జరగదు.

పర్మిట్ జారీ చేయడానికి ముందుగా, దరఖాస్తుదారు విమానాశ్రయ ఆవరణంలో చిత్రీకరణకు సంబంధించిన రాతప్రతితో, పరిశీలన కోసం జీహెచ్‌ఐఏఎల్‌‌కి సమర్పించాలి.

ఇతర సంబంధిత అధికారుల నుండి దరఖాస్తుదారు అందుకున్న అనుమతులతో సంబంధం లేకుండా, ఆర్‌జీఐఏ విమానాశ్రయం కోసం ఈ పాలసీ కింద అనుమతి/ల జారీకి జీహెచ్‌ఐఏఎల్‌‌ నిర్ణయమే అంతిమం. ఈ కార్యకలాపం కోసం విమానాశ్రయంలోకి ప్రవేశించే వ్యక్తుల సంఖ్య, పరికరాల రకాలను పరిమితం చేసే హక్కు జీహెచ్‌ఐఏఎల్‌‌కి ఉంది.

మొత్తం కార్యాచరణ సందర్భంగా పర్యవేక్షణ కోసం జీహెచ్‌ఐఏఎల్‌‌ తన స్వంత ఎస్కార్ట్‌ను నియమిస్తుంది, ఇది తప్పనిసరి. దరఖాస్తుదారు అభ్యర్థనపై, లభ్యతకు లోబడి విద్యుత్ వంటి ఏవైనా అదనపు అవసరాలు పరిగణించబడతాయి, దానితోపాటు ఖర్చు మీద 10% అదనంగా బిల్ చేయబడుతుంది.

ఏదేని శుభ్రపరచడం లేదా హౌస్‌కీపింగ్ చర్యలు, దరఖాస్తుదారుచే సృష్టించబడిన, మరియు/లేదా తీసుకురాబడిన చెత్త లేదా ఏవేని వ్యర్థపదార్థాలు విమానాశ్రయ ఆవరణము నుండి తొలగించే బాధ్యత పూర్తిగా దరఖాస్తుదారుదే. ఈ విషయానికి సంబంధించి దరఖాస్తుదారు యొక్క నిర్లక్ష్యము లేదా వైఫల్యము కారణంగా చేసే అన్ని ఖర్చులకూ జీహెచ్‌ఐఏఎల్‌‌‌ బిల్లు వేసి, వసూలు చేస్తుంది.

సమంజసమైన, నిష్పాక్షికమైన మరియు విషయ-తటస్థమైన రీతిలో, మరియు మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన, చోటు లభ్యతను బట్టి పర్మిట్ దరఖాస్తులను పరిగణిస్తారు. ఒకవేళ ఒక పర్మిట్ దరఖాస్తును తిరస్కరిస్తే, ఆ తిరస్కరణకు గల కారణాలను దరఖాస్తుదారుకు తెలియజేస్తారు.

ఒక పర్మిట్ దరఖాస్తు తిరస్కరణకు ఆధారాలు మరియు /లేదా కారణాలలో ఇవి కూడా ఉంటాయి:

  • దరఖాస్తును పరిగణించడానికి గాను జీహెచ్‌ఐఏఎల్‌‌‌చే సహేతుకంగా, అవసరమైనట్లుగా సంపూర్ణమైన మరియు ఖచ్చితమైన దరఖాస్తును దాఖలు చేయాలని కోరాక లేదా అడిగిన అదనపు సమాచారమును అందజేయడంలో దరఖాస్తుదారు వైఫల్యము.
  • దరఖాస్తులో ఏదైనా తప్పుడు ప్రకటన చేయడం లేదా తప్పుగా ప్రాతినిధ్యం చేయడం, లేదా ఏదైనా సత్యాన్ని వెల్లడి చేయడంలో వైఫల్యము జరిగితే దరఖాస్తు చెల్లుబాటు కాదు.
  • అవసరమైన రుసుము, ఏవైనా ఉంటే, మునుపటి పర్మిట్ల వల్ల తలెత్తిన నష్టపు క్లెయిముల బకాయిలు, లేదా సెక్యూరిటీ ధరావత్తులు, హామీ బాండ్లు లేదా అవసరమైనట్లుగా నష్టబాధ్యత బీమా చెల్లించడంలో దరఖాస్తుదారు వైఫల్యము.
  • స్థలం లభ్యత లేకపోవడం
  • ప్రతిపాదిత ఫోటోగ్రఫీ/వీడియోగ్రఫీ/సినిమాటోగ్రఫీ, విమానాశ్రయం యొక్క భద్రత, క్రమబద్ధత, మరియు సమర్థవంతమైన పనివ్యవహారాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం, ప్రయాణాన్ని ఆటంకపరిచే అవకాశం, విమానాశ్రయ భద్రతా చర్యలను కుంటుపరచే అవకాశం, లేదా వస్తురూపేణా విమానాశ్రయం వద్ద రద్దీని పెంచే అవకాశం.
  • ప్రజా ఆరోగ్యం, భద్రతల పరిరక్షణ
  • ఎయిర్‌పోర్ట్ వద్ద వైమానిక కార్యకలాపాలలో జోక్యం చేసుకోవడం
  • రాష్ట్ర లేదా స్థానిక చట్టాలు, శాసనాలు, ఆర్డినెన్సులు, DGCA మరియు BCAS ప్రకటించిన నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం, వాటికే పరిమితం కాకుండా విమానాశ్రయ పని నిర్వహణ మరియు భద్రతను శాసించే నియమనిబంధనలకు అంగీకరించకపోవడం.
  • విమానాశ్రయం వద్ద నిర్మాణ, మరమ్మత్తు లేదా నిర్వహణ కార్యకలాపాలు
  • ఎయిర్‌పోర్ట్ ఎమర్జెన్సీ
  • పర్మిట్ నిబంధనలకు లోబడి ఉండడంలో వైఫల్యం కారణంగా మునుపటి 12 నెలల కాలములో దరఖాస్తుదారుకు జారీ చేయబడిన మునుపటి ఏదేని పర్మిట్ రద్దు చేయబడి ఉండడం.
  • పర్మిట్ లిఖితపూర్వకంగా ఉంటుంది మరియు ఇతర నియమనిబంధనలు మరియు సీఈఓకు సహేతుకంగా తోచిన అవసరమైన షరతులన్నీ దీనిలో ఉంటాయి. విమానాశ్రయము లేదా దాని ఆవరణము/ ఆస్తి వద్ద ఫోటోగ్రఫీ/వీడియోగ్రఫీ/సినిమాటోగ్రఫీ మొదలుపెట్టడానికి ముందు సీఈఓ లేదా సీఈఓచే అధీకృతపరచబడిన ఎవరైనా జీహెచ్‌ఐఏఎల్‌‌‌ అధికారి మరియు దరఖాస్తుదారు యొక్క అధీకృత అధికారిచే దానిని అమలు చేయాలి.

అలా జారీ చేయబడిన పర్మిట్, ఈ నియమాలకు అనుగుణంగా ఆవరణమును ఉపయోగించుకోవడానికి దరఖాస్తుదారుకు ఒక లైసెన్సును మాత్రమే మంజూరు చేస్తుంది. ఇది ఒక లీజు కాదు, ఇది ఆవరణములో దరఖాస్తుదారుకు ఎటువంటి ఎస్టేట్ లేదా ఆస్తి ప్రయోజనమును కల్పించదు. పర్మిట్ అనేది దరఖాస్తుదారుకు వ్యక్తిగతమైనది, మరియు ఏది ఏమైనా ఎట్టి పరిస్థితులలోనూ వేరొకరికి పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ కేటాయించకూడదు లేదా బదిలీ చేయకూడదు.

ఫోటోగ్రఫీ/ వీడియోగ్రఫీ/ సినిమాటోగ్రఫీ కొరకు అనుమతి అనేది విమానయాన అవసరాల కొరకు విమానాశ్రయాన్ని వాడడం తర్వాతే దరఖాస్తుదారుచే విమానాశ్రయ ఆవరణము/ఆస్తి యొక్క వాడకానికి అవకాశం కల్పిస్తుంది. విమానాశ్రయం మరియు విమానాశ్రయ టెర్మినల్ యొక్క స్థలము మరియు డిజైన్ పరిమితుల కారణంగా, సీఈఓ తన విచక్షణ మేరకు ఫోటోగ్రఫీ/ వీడియోగ్రఫీ/ సినిమాటోగ్రఫీ రకం, వ్యవధి, ప్రదేశాన్ని పరిమితం చేయవచ్చు.

విమానాశ్రయం మరియు విమానాశ్రయ టెర్మినల్ స్థలము, డిజైన్ పరిమితుల కారణంగా, సీఈఓ తన విచక్షణ మేరకు ఫోటోగ్రఫీ/ వీడియోగ్రఫీ/ సినిమాటోగ్రఫీ యొక్క రకం, వ్యవధి మరియు స్థానమును పరిమితం చేయవచ్చు.

ఫోటో లేదా వీడియో చిత్రీకరణలో ఎటువంటి నేరపూరిత లేదా అశ్లీల అంశాలను ప్రదర్శించరాదు లేదా రాజకీయ, మతపరమైన లేదా జాతిపరమైన భావాలను ధ్వనించరాదు.

దరఖాస్తు డౌన్‌లోడ్

ఈ క్రింది వాటిలో ఏదైనా సంభవించిన మీదట జీహెచ్‌ఐఏఎల్‌‌‌, దరఖాస్తుదారుకు నోటీసును జారీ చేయడం ద్వారా వారికి మంజూరు చేసిన పర్మిట్‌ని రద్దు చేస్తుంది లేదా ఆపేస్తుంది:

పర్మిట్ కొరకు దరఖాస్తులో వస్తురూపేణా ఏదైనా తప్పుడు ప్రకటన చేయడం లేదా తప్పుగా వినతి చేయడం, లేదా ఏదైనా వాస్తవ సమాచారాన్ని వెల్లడి చేయడంలో వైఫల్యము.

ఈ పర్మిట్ క్రింద జీహెచ్‌ఐఏఎల్‌‌‌కు బాకీ ఉన్న పర్మిట్ ఫీజు లేదా ఇతర మొత్తాలు చెల్లించుటలో, లేదా పర్మిట్ మరియు ఈ నియమాలకు సమ్మతి వహించుటలో దరఖాస్తుదారు వైఫల్యము, మరియు జీహెచ్‌ఐఏఎల్‌‌‌ నుండి నోటీసు అందిన మూడు (03) గంటల లోపున అట్టి ఉల్లంఘనను సరిచేయకపోవడం; ఒకవేళ ఆ ఉల్లంఘన ప్రజారోగ్యానికి లేదా భద్రతకు, విమానాశ్రయ భద్రతకు తక్షణ అపాయమును కలిగించేటట్లయితే లేదా విమానాశ్రయ లేదా విమాన కార్యకలాపాలలో జోక్యం చేసుకునేదైతే ఎటువంటి ముందస్తు నోటీసు మరియు సరిచేయడానికి అవకాశం ఇవ్వడం జరగదు.

ప్రకృతి వైపరీత్యము, దేవుడి చర్యలు, విమానాశ్రయ ఆస్తి, విమానాశ్రయ ఎమర్జెన్సీ, విమానాశ్రయ భద్రతా అవసరాలకు ఊహించని నష్టం జరగడం లేదా విధ్వంసం, చట్టము, నియమనిబంధనల ఆవశ్యకత, న్యాయపరిధి ఉన్న ఒక కోర్టు లేదా నియంత్రణా సంస్థ ఉత్తర్వు, లేదా జీహెచ్‌ఐఏఎల్‌‌‌ నియంత్రణలో ఉన్న మరేదైనా కారణము.

పైన కనబరచిన సెక్షన్ 7.a.i లేదా 7.a.ii. క్రింద పర్మిట్ రద్దు చేయబడిన పక్షములో, జీహెచ్‌ఐఏఎల్‌‌‌ అదే దరఖాస్తుదారు లేదా వారి అనుబంధ సంస్థ నుండి కనీసం పన్నెండు నెలల కాలవ్యవధి పాటు మరొక దరఖాస్తును స్వీకరించదు లేదా ఆమోదించదు. ఒక పర్మిట్‌ని రద్దు చేసిన మీదట, దరఖాస్తుదారు తక్షణమే తన వ్యక్తిగత ఆస్తి/ సామాగ్రి అంతటినీ తీసుకుని విమానాశ్రయ ఆవరణము/ ఆస్తిని వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. విమానాశ్రయ ఆవరణములో తొలగింపు లేదా శుభ్రత కోసం చేసే ఏవైనా ఖర్చులు దరఖాస్తుదారు నుండి వసూలు చేయడం జరుగుతుంది.

సీఈఓచే లిఖితపూర్వకంగా ఇతరత్రా అంగీకరించబడి ఉంటే తప్ప, పర్మిట్లు అన్నీ ఈ క్రింది షరతులు, నిబంధనలకు లోబడి ఉంటాయి:

  • పర్మిట్ నందు కనబరచినట్లు ఫోటోగ్రఫీ /వీడియోగ్రఫీ/సినిమాటోగ్రఫీ కేవలం ప్యాసెంజర్ టెర్మినల్ మరియు ల్యాండ్‌సైడ్ ఏరియాకు మాత్రమే పరిమితం కావాలి.
  • దరఖాస్తుదారు ఎయిర్‌పోర్ట్ వాడుకందారులెవరినీ అతని/ఆమె సమ్మతి లేనిదే ఫోటోగ్రాఫ్ తీయకూడదు.
  • పాదచారులు లేదా వాహన సంబంధిత ట్రాఫిక్ స్వేచ్ఛగా కదలడానికి, లేదా విమానాశ్రయం వద్ద నిర్వహించే ఏవేని అధీకృత కార్యకలాపాలకు దరఖాస్తుదారు ఆటంకం కలిగించకూడదు, అడ్డుకోకూడదు లేదా జోక్యం చేసుకోకూడదు.
  • ఆయా ఉదంతమును బట్టి వాస్తవ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ లేదా సినిమాటోగ్రఫీ జరుగుతున్న సందర్భంగా కెమెరా ముందు ఉండే వ్యక్తులు తప్ప, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ లేదా సినిమాటోగ్రఫీ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తీ విమానాశ్రయ పరిధిలో ఉన్నప్పుడు వ్యక్తి పేరు, అనుమతిని పొందిన గ్రూప్ లేదా సంస్థ యొక్క పేరును ప్రముఖంగా ప్రదర్శించే ఒక గుర్తింపు బ్యాడ్జీని ధరించాలి. కార్యక్రమానికి, ఆవరణకు బాధ్యులైన వ్యక్తులను సంప్రదించడానికి అలాంటి వారి జాబితాను ఫోన్ నంబర్లతో సహా దరఖాస్తుదారు జీహెచ్‌ఐఏఎల్‌‌‌ వారికి ఇవ్వాలి. ఆ జాబితాలో 24-గంటల పాటు మరియు వారాంతాలలో ఎప్పుడైనా సరే కాల్ చేయగలిగిన నంబర్లు ఉండాలి. ఏదైనా అత్యవసరపరిస్థితి తలెత్తిన పక్షములో సంప్రదించదగిన జీహెచ్‌ఐఏఎల్‌‌‌ అధికారుల పేర్లు, ఫోన్ నంబర్ల జాబితాను జీహెచ్‌ఐఏఎల్‌‌‌ దరఖాస్తుదారుకు అందజేస్తుంది.
  • ఒకవేళ విమానాశ్రయ ఆవరణము/ ఆస్తికి ఏదైనా నష్టం జరిగిన లేదా పాడైన పక్షంలో, లేదా దరఖాస్తుదారు లేదా వారి సిబ్బందిచే చేపట్టే కార్యక్రమాల ఫలితంగా వ్యక్తులకు గాయాలు కలిగిన పక్షంలో, దరఖాస్తుదారుకు ఏదేని ఇతర లేదా భవిష్యత్ పర్మిట్/ల జారీ, సీఈఓ నిర్ధారించే, నిర్ణయించే మొత్తానికి అదనపు సెక్యూరిటీ ధరావత్తు ఆవశ్యకత, సెక్యూరిటీ బాండు, నష్టబాధ్యత బీమాతో సహా జీహెచ్‌ఐఏఎల్‌‌‌ సీఈఓ విధించే అలాంటి అదనపు నిబంధనలకు లోబడి ఉంటుంది.
  • దరఖాస్తుదారు పర్మిట్ క్రింద చేపట్టదగిన కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ నియమాల ఆవశ్యకతకు అనుగుణంగా అవసరమైన లేదా సముచితమైన పరికరాలు, సామాగ్రి జాబితాను జీహెచ్‌ఐఏఎల్‌‌‌ వారికి ముందస్తుగానే అందజేస్తారు. ఆవరణములో ఉపయోగించడానికి ప్రతిపాదించే ఏవైనా ప్రత్యేక పరికరాలు లేదా సామాగ్రిని దరఖాస్తుదారు తన దరఖాస్తులో పేర్కొనాలి. జీహెచ్‌ఐఏఎల్‌‌‌ లేదా ఏదేని సెక్యూరిటీ ఏజెన్సీ లేదా ప్రభుత్వ శాఖ అధికారి అట్టి డిస్‌ప్లే పరికరాలు లేదా సామాగ్రి వాడకమును తిరస్కరించవచ్చు లేదా వాటిని పరిమితి చేయవచ్చు. అలాంటి సందర్భంలో ఆ సామాగ్రి తొలగింపు దరఖాస్తుదారు బాధ్యత.
  • ప్యాసెంజర్ టెర్మినల్ భవనం, పార్కింగ్, మరియు ల్యాండ్‌సైడ్‌లో పొగత్రాగడం సంపూర్ణంగా నిషేధించబడింది.

GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ తన విచక్షణ మేరకు దరఖాస్తుదారుకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే పాలసీ నిబంధనలలో మార్పులుచేర్పులు చేయడానికి, మార్చడానికి హక్కును కలిగి ఉంటుంది.

పైన పేర్కొన్న షరతులు, నిబంధనలకు కట్టుబడి ఉండటంలో దరఖాస్తుదారు విఫలమైన పక్షంలో సెక్యూరిటీ ధరావత్తును జీహెచ్‌ఐఏఎల్‌‌‌ జప్తు చేసుకుంటుంది.

దరఖాస్తుదారుకు మంజూరు చేయబడిన పర్మిట్‌కి సంబంధించి లేవనెత్తే అన్ని లేదా ఏదైనా వివాదము లేదా వివాదాలు హైదరాబాద్‌లోని కోర్టుల న్యాయపరిధికి మాత్రమే లోబడి ఉంటాయి.

వాణిజ్యపరమైన ఉపయోగం కోసం RGIA వద్ద కదిలే చిత్రాలు, సినిమాటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీలో ఆసక్తి ఉందా?


మరిన్ని వివరాల కొరకై సంప్రదించండి:

నాన్-ఏరో కమర్షియల్ డిపార్ట్‌మెంట్: